హైదరాబాద్ నగరంలో నిరుద్యోగులు డిగ్రీ పట్టా పట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా సరైన ఉద్యోగం దొరకడంలేదు. జాబ్ చేయడానికి అవసరమైన నైపుణ్యాలు లేకపోవడమే అందుకు ముఖ్య కారణం. అనేక ఇంటర్వ్యూలకు వెళ్లిన తరువాత గాని వారికి ఈ సంగతి అర్థం కావడంలేదు. ఎక్కువ మార్కులు సంపాదించి ఇంటర్ లేదా డిగ్రీ, బీటెక్, పాస్ కావడమే లక్షంగా చదివిన విద్యార్థులు. ఉద్యోగం కోసం నైపుణ్యాలు నేర్చుకోవాలనే విషయాన్ని గుర్తించడం లేదు. మరి అలాంటి నైపుణ్యాలు ఎక్కడ నేర్పుతారు అనే సందేహాలకు సమాధానమే"నిర్మాణ్" వారి స్మార్ట్ ఉచిత శిక్షణ కేంద్రం...  
నిర్మాణ్ ద్వారా శిక్షణ పొంది ఉద్యోగం చేస్తున్నా స్టూడెంట్స్....  
  1), బర్తి తిలక్‌ :- 
తాళ్లపూడిలో (పశ్చిమగోదావరి జిల్లా ) రోజూ కూలీ చేసుకొని బతుకుతున్న తండ్రీ సహకారంతో కుమారుడు బర్తి తిలక్‌ పేదరికంలో పుట్టినా, ప్రతిభకు పేదరికం లేదని నిరూపించాడు. తండ్రీ చమటోడ్చి సంపాదించిన ప్రతీ పైసా తన చదువు కోసం ఖర్చు పెట్టడం గమనించిన తిలక్‌ కష్టపడి చదివి ఇంజనీరింగ్‌ డిగ్రీ పూర్తి చేశాడు. ఉద్యోగం కోసం ప్రయత్నాలు మొదలైన క్రమంలో నిర్మాణ్‌ సంస్ద నైపుణ్య శిక్షణ ఇస్తున్నారని తెలుసుకొని హైదరాబాద్‌ వచ్చి  వెబ్ & మొబైల్ అప్లికేషన్ ట్రైనింగ్ లో పరిజ్నానం పొంది స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ సాధించాడు. 
అతని ప్రతిభను గుర్తించిన నిర్మాణ్‌ సంస్ధ నెక్సీల్యాబ్స్‌లో ప్లేస్‌ మెంట్‌ని కల్పించింది. నేడు డిజైనర్‌గా పనిచేస్తూ (నెల కి 20,000/-)హ్యాపీగా జీవిస్తున్నాడు. ఆదాయంలో కొంత తండ్రికి పంపిస్తూ వారి కుటుంబ భాద్యతలో పాలుపంచుకుంటున్నాడు.
2), లక్ష్మి సుధ :- 
                     మేము గచ్చిబౌలి లో ఉంటాము అమ్మ ఇంటిపనులు చూసుకుంటుంది నాన్న సెక్యూరిటీ గార్డ్ గా చేస్తారు. అక్క కూడా ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తుంది. నేను 2017 లో డిగ్రీ కంప్లిట్ చేసి ప్రైవేట్ హాస్పిటల్లో రిసెప్సనిస్ట్ గా పేషెంట్స్ పేర్లు రాసేదాన్ని 4000 వేలకు ఉద్యోగం చేసేదాన్ని. నిర్మాణ్ - టెక్ మహీంద్రా స్మార్ట్ సెంటర్ గురించి అక్కడ నేర్పిస్తున్నా స్కిల్స్ మరియు ఉద్యోగ అవకాశాల గురించి తెలిసింది. అందులో జాయిన్ అవుతే కంప్యూటర్ మరియు ఇంగ్లీష్ లలో శిక్షణ ఇచ్చి ఇప్పుడు చేస్తున్న దానికన్నా చాల మంచి ఉద్యోగం ( IKEA  లో Food Coworker గా నెల కి 19000/- ) చూపించారు ఇలాంటి మంచి అవకాశాలను కల్పిస్తున్న నిర్మాణ్ - టెక్ మహీంద్రలకు రుణపడి ఉంటాను... 
తిలక్‌, లక్ష్మి సుధ లాంటి పేద యువతీ యువకులకు అండగా నిలబడిని సంస్ధ 'నిర్మాణ్‌ ' గ్రామీణ పేద యువతకు నైపుణ్య శిక్షణను ఇచ్చి , జీవితంలో స్ధిరపడేలా వారికి ప్లేస్‌ మెంట్‌ కల్పించడం నిర్మాణ్‌ లక్ష్మం. ఉన్నత చదువులు చదివి నిరుద్యోగులుగా నిరాశకు లోనవకుండా నిర్మాణ్‌ ను సంప్రదించండి..
నిరంతరం శిక్షణ...
 బీటెక్‌ వరకు చదువుగల నిరుద్యోగ యువతీ యువకులకు HTML,CSS,BOOTSRAP,CORE JAVA(OOPS), ANDROID APPLICATION DEVELOPMENT,Angular JS ,BUSINESS ENGLISH, INTERVIEW SKILLS పదవ తరగతి నుంచి డిగ్రీ మొదలు కంప్యూటర్ బేసిక్స్, స్పోకెన్ ఇంగ్లీష్, ఇంగ్లిష్ టైపింగ్, ఇంటర్నెట్ పరిజ్ఞానం, అకౌంట్స్, జియస్టి, అడ్వాన్స్డ్ ఎక్సెల్ మరియు సాఫ్ట్‌వేర్‌ కోర్సులలో శిక్షణ ఇస్తున్నారు. గతంలో ఇక్కడ శిక్షణ పొందిన వారు, డెల్‌, టెక్‌ మహీంద్ర, కాప్‌ జెమిని, ఐకియా, టిసి యస్, వెస్ట్ సైడ్, రేడియంట్, అపోలో, లాంటి ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలు పొందారు. అసలీ నైపుణ్య శిక్షణను ఉచితంగా ఇవ్వాలని నిర్మాణ్‌ సంకల్పం. అయితే పదవ తరగతి నుంచి డిగ్రీ విద్యార్థులకు ఉచితంగాను, బిటెక్ విద్యార్ధులకు అతి స్వల్ప ఫీజులు నిర్ణయించారు. 
ఇదీ చిరునామా...
ఆసక్తిగల అభ్యర్థులు  బిటెక్ వారు ఆదిత్య ఎంక్లేవ్‌, నీలగిరి బ్లాక్‌, అమీర్‌పేట లోని నిర్మాణ్‌ టెక్‌ మహేంద్ర ఫౌండేషన్‌ శిక్షణ కేంద్రంలో.  పదవ తరగతి నుంచి డిగ్రీ విద్యార్థులు కూకట్పల్లి బస్టాప్ దగ్గర గల నిర్మాణ్‌ టెక్‌ మహేంద్ర ఫౌండేషన్‌ శిక్షణ కేంద్రంలో ధరఖాస్తు చేసుకోవచ్చు ఈ  శిక్షణ కేంద్రాలలో ప్రతీ 3 నెలలకు ఒక సారి శిక్షణా కార్యక్రమం ఉంటుంది. మరిన్ని వివరాలకు, 76759 14735 / 36 - 95156 65095 నెంబర్లను సంప్రదించగలరు .



మరింత సమాచారం తెలుసుకోండి: