కావాలంటే ఈ వార్త చదవండి. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన శాయిలు,సంతోష్‌ ఇంటర్‌ చదివి నిరుద్యోగులుగా మిగిలి పోయారు.
ఉపాధి లేక, కూలీలుగా ఎక్కడైనా పని దొరుకుతుందేమేనని చూశారు... అలాంటి సమయంలో నిజామాబాద్‌ జిల్లా, వర్ని లోని సిసిడి లో హోటల్‌ మేనేజ్‌ మెంట్‌లో శిక్షణ ఇస్తున్నారని తెలిసి అక్కడ నెల రోజులు శిక్షణ పొందారు.అనంతరం వారి జీవితంలో మార్పు మొదలైంది. హైదరాబాద్‌ లోని ప్రముఖ హోటల్స్‌లో ఉద్యోగాలు వచ్చాయి. నెలకు 10వేల నుండి 18 వేల వరకు వేతనాలు పొందుతున్నారు.

మొన్నటి వరకు ఊర్లో ఎవరూ పట్టించుకోని వారు నేడు మనోళ్లు సిటీలో ఉద్యోగం చేస్తున్నారని గౌరవంగా చూస్తున్నారు.
శిక్షణ ఇచ్చేది ఎవరు?
ఆసరా అందిస్తే అందలాన్ని అందుకోగలిగే యువతీ,యవకులు ఎందరో, అలాంటి వారు జీవితంలో నిలదొక్కుకోవడానికి ఉచితంగా ఉపాధి శిక్షణ అందిస్తోంది సిసిడి వర్ని. విద్యా,ఉపాధి కోసం దేశవ్యాప్తంగా పనిచేస్తున్న ప్రముఖ స్వచ్ఛంద సంస్థ 'ప్రథమ్‌' సహకారంతో నిరుద్యోగ యువతీయువకులకు, మహిళలకు పలు అంశాల్లో ఉచితంగా శిక్షణ ఇచ్చి, నిపుణులుగా తీర్చిదిద్ది, వారి కాళ్ల మీద వాళ్లు నిలబడేలా   కృషి చేస్తోంది.
నైపుణ్య శిక్షణ ఎలా..?
5వతరగతి నుండి ఇంటర్‌ మీడియట్‌ వరకు ఎవరికి అవసరమైన వృత్తి విద్యలో వారికి శిక్షణ ఉంది. 18నుండి 30సంవత్సరాల వయసు గల యువతీ యువకులు అర్హులు. అభ్యర్దులకు శిక్షణతో పాటు, వసతి,భోజన సదుపాయం కల్పించి, ఉద్యోగాలు పొందడానికి వీలుగా సాఫ్ట్‌ స్కిల్స్‌లో కూడా శిక్షణ ఇస్తారు.
ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా...
శిక్షణ పూర్తిగా ఉచితం. వసతి, ఆహారం ఇవ్వడమే కాకుండా యూనిఫామ్‌, కోర్సుకు సంబంధించి పుస్తకాలు,పరికరాలు ఇస్తారు. మూడు నెలల పాటు శిక్షణ తీసుకోవాలి. తర్వాత సంస్థ ప్రతినిధులే వీరికి ఉపాధి కల్పించే బాధ్యత తీసుకుంటారు. ఉద్యోగులు కావాల్సిన సంస్థల జాబితా నిర్వాహకుల దగ్గర ఉంటుంది. వీరు ఆయా జాబితాలోని సంస్థలను సంప్రదించి తమ వద్ద శిక్షణ పొందిన వారి వివరాలు ఇచ్చి ఉద్యోగం ఇప్పించేందుకు సహకరిస్తారు.
శిక్షణ పొందే కోర్సులు ఇవే...
హోటల్‌ మేనేజ్‌ మెంట్‌, హెల్త్‌కేర్‌.బ్యూటీషియన్‌,ఆటోమేటివ్‌, ఎలక్ట్రీషియన్‌.వీటికి అదనంగా స్పోకెన్‌ ఇంగ్లీషు,కంప్యూటర్‌ శిక్షణ ఉంటుంది. ఈ ధృవీకరణ పత్రాలు ఉంటే చాలు. విద్యార్హత, ఆధార్‌, వయస్సు ధృవీకరణ,రేషన్‌ కార్డు, ఫొటోలు ప్రతీదీ 5కాపీలు చొప్పున అందచేయాలి.
శిక్షణ ఎక్కడ?
1, నిజామాబాద్‌ జిల్లా, వర్నిలోని సిసిడి వర్ని. 2, హైదరాబాద్‌ సమీపంలోని,నాగోల్‌ దగ్గర బండ్లగూడ మరిన్ని వివరాలకు, టోల్‌ ఫ్రీ నెంబర్‌, 1800.3000.8848 మరిన్ని వివరాలకు, 7093411084, 9989025236, 8919409176 కి కాల్‌ చేయవచ్చు. 


మరింత సమాచారం తెలుసుకోండి: