ప్రస్తుత యువత లో అధిక శాతం బ్యాంకింగ్ రంగంలో స్థిరపడాలని ఆరాట పడుతున్నారు. అందుకు గాను వివిధ కోచింగ్ సెంటర్స్ లో ట్రైనింగ్ పొందుతున్న వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోవడం గమనార్హం. ఈ క్రమంలోనే ప్రభుత్వ బ్యాంకింగ్ సంస్థలు తమ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకి నోటిఫికేషన్లు ఎప్పటికప్పుడు విడుదల చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఎస్బీఐ కూడా నోటిఫికేషన్ విడుదల చేసింది. సుమారు 76 ఎస్బీఐ స్పెషలిస్ట్ కేడర్ పోస్టులని భర్తీ చేయనుంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 76.
ఖాళీల వివరాలు: డిప్యూటీ జనరల్ మేనేజర్-1, ఎస్ఎంఈ క్రెడిట్ అనలిస్ట్ (సెక్టర్ స్పెషలిస్ట్)-25, క్రెడిట్ అనలిస్ట్-50.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో
గ్రాడ్యుయేషన్, సీఏ, ఎంబీఏ (ఫైనాన్స్), సీఎఫ్ఏ, బీఈ/బీటెక్, ఎంబీఏ, పీజీడీఎం ఉత్తీర్ణత, అనుభవం.
వయసు: 23-35
ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక : షార్ట్ లిస్టింగ్ , ఇంటర్వ్యూ.
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
చివరితేదీ: 12.08.2019.
పూర్తి వివరాలకు వెబ్సైట్: https://bank.sbi/careers