భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ లిమిటెడ్ కి చెందిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ లోని నాన్ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా..మొత్తం 559 ఖాళీలని భారతీ చేయనున్నారు.

 Jobs

పోస్టుల వివరాలు...
ఖాళీలు: 559
1) జూనియర్‌ ట్రెయినీ : 530 
విభాగాల వారీ ఖాళీలు: మెకానికల్‌ – 260, ఎలక్టిక్రల్‌ – 115, మెటలర్జీ – 86, కెమికల్‌ – 43, ఎలక్టాన్రిక్స్‌ – 05, ఇన్‌స్టుమ్రెంటేషన్‌ – 09, సివిల్‌ – 02, రిఫ్రాక్టరీ – 10. 
అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత విభాగాల్లో ఐటీఐ/ డిప్లొమా ఉత్తీర్ణత. బీఈ/ బీటెక్, ఎంబీఏ వంటి ఉన్నత విద్యార్హతలు ఉన్న వారు దరఖాస్తు చేసుకోడానికి అనర్హులు.
2) ఆపరేటర్‌ కం మెకానిక్‌ ట్రైయినీ: 29
అర్హత: పదో తరగతితో పాటు సంబంధిత విభాగాల్లో ఐటీఐ/ డిప్లొమా ఉత్తీర్ణత. హెవీ మోటార్‌ వెహికల్‌ లైసెన్స్‌ కలిగి ఉండాలి.
వయో పరిమితి: 01.07.2019 నాటికి 27 ఏళ్ళు మించకూడదు. 
ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ బేసిడ్‌ టెస్ట్, సర్టిఫికెట్‌ వెరిఫికేషన్, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో 
దరఖాస్తులకు ఫీజు: రూ.300 + జీఎస్‌టీ (ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు ఫీజు లేదు)
దరఖాస్తులకు తేదీ: ఆగస్టు 01, 2019 
దరఖాస్తులకు ఆఖరు తేదీ : ఆగస్టు 21, 2019
పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:
https://www.vizagsteel.com/myindex.asp?tm=9&url=code/tenders/viewjobads.asp 


మరింత సమాచారం తెలుసుకోండి: