చదువుకోవాలనే తపనతో తమ వైకాల్యాన్ని సైతం జయిస్తూ ఉన్నత చదువులకై పోటీ పడుతున్న దివ్యంగా విద్యార్ధులకి సాయం అందిస్తోంది  కేంద్ర ప్రభుత్వం. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వశాఖ దివ్యాంగులకి ఉపకార వేతనాలని అందించే దశలో ఈ సాయాన్ని అందిస్తోంది.తొమ్మిదో తరగతి నుంచీ పీహెచ్ డీ వరకూ చదివే వారు ఎవరైనా సరే ఈ  స్కాలర్‌షిప్ కి దరఖాస్తు చేసుకోవచ్చు.

 Scholarships

 

స్కాలర్‌షిప్  వివరాలు...

1) ప్రి మెట్రిక్ స్కాలర్‌షిప్: 
అర్హత: 9, 10 తరగతుల విద్యార్థులకు
స్కాలర్‌షిప్పుల సంఖ్య: 20,000

2) పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్
అర్హత: ఇంటర్ ప్రథమ సంవత్సరం నుంచి మాస్టర్ డిగ్రీ లేదా డిప్లొమా స్థాయి వరకు
స్కాలర్‌షిప్పుల సంఖ్య: 17,000 

3) టాప్ క్లాస్ ఎడ్యుకేషన్ స్కాలర్‌షిప్పులు 
అర్హత: గుర్తించిన 240 అత్యుత్తమ విద్యా సంస్థల్లో పోస్టు గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమా కోర్సుల్లో చేరినవారికి.
స్కాలర్‌షిప్పుల సంఖ్య: 300

4) ఓవర్సీస్ స్కాలర్‌షిప్పులు 
అర్హత: విదేశాల్లో మాస్టర్ డిగ్రీ, డాక్టొరేట్ డిగ్రీ చదువుతున్న విద్యార్థులకు
స్కాలర్‌షిప్పులు: 20

5) దివ్యాంగుల నేషనల్ ఫెలోషిప్పులు 
అర్హత: ఎంఫిల్, పీహెచ్‌డీ కోర్సుల్లో చేరినవారికి
స్కాలర్‌షిప్పుల సంఖ్య: 200

6) ఫ్రీ కోచింగ్
అర్హత: పభ్రుత్వ/ ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగ శిక్షణకు; సాంకేతిక, వృత్తి విద్యా సంస్థల్లో ప్రవేశాలకు
స్కాలర్‌షిప్పుల సంఖ్య: 2000

అర్హతలు:  విద్యార్థులు ఏ స్కాలర్‌షిప్పుకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ కనీసం 40శాతం పైగా వైకల్యం ఉండాలి. అలాగే ఇతర ఏ స్కాలర్‌షిప్పులూ పొందనివారే వీటికి అర్హులు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.
చివరితేది: ప్రిమెట్రిక్: 15.10.2019, పోస్ట్ మెట్రిక్: 31.10.2019, టాప్ క్లాస్ ఎడ్యుకేషన్: 31.10.2019. 
మరిన్ని వివరాలకై వెబ్‌సైట్:   http://disabilityaffairs.gov.in/content/

 


మరింత సమాచారం తెలుసుకోండి: