ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (IICT) తెలంగాణ రాష్ట్రం లోని హైదరాబాదు నగరంలో నెలకొల్పబడిన జాతీయ పరిశోధనా సంస్థ. ఇది "కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్" సంస్థ యొక్క పరిధిలో వచ్చిన కొద్ది కాలానికి రీజనల్ రీసెర్చి లాబొరేటరీ, హైదరాబాదుగా రూపొందింది. ఇది 1944 లో స్థాపించబడింది. దీని నూతన భవన సముదాయమును ప్రధాని నెహ్రూ జనవరి 2, 1954లో ప్రారంభోత్సవం చేసారు.


ఈ సంస్థ రసాయన శాస్త్రం, జీవ రసాయన శాస్త్రం, బయో ఇన్‌ఫర్మేటిక్స్, కెమికల్ ఇంజనీరింగు మరియు శాస్త్ర సాంకేతిక రంగాలపై పరిశోధనలు చేస్తుంది. ఇది మన దేశ పారిశ్రామిక మరియు ఆర్థిఅక్ రంగ పురోభివృద్ధికి పాటుబడుతుంది. వివిధ జాతీయ, అంతర్జాతీయ పత్రికలలో 400 కి పైగా రసాయనిక శాస్త్ర పరిశోధనాత్మక వ్యాసాలను వెలువరించింది. ఈ సంస్థలోని శాస్త్రవేత్తలు ఆర్గానిక్ కెమిస్ట్రీ, నానో టెక్నాలజీ, కెటాలసిస్, లిపిడ్ కెమిస్ట్రీ, మెకానికల్ డిసైనింగు, పాలిమర్స్, నానల్ డ్రగ్ డెలివరీ, కెమికల్ ఇంజనీరింగ్, ఇంజరీరింగ్ మొదలైన విభాగాలలో పరిశోధనా విజయాలను సాధించారు.


హైదరాబాద్ లోని తార్నాక లో గల CSIR – ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (IICT) లో 19 సైంటిస్ట్ పోస్టులకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా సీనియర్ సైంటిస్ట్, ప్రిన్సిపల్ సైంటిస్ట్, తదితర ఖాళీలని భర్తీ చేయనుంది. 

 Jobs

విభాగాల వారీ ఖాళీలు:

సైంటిస్ట్-13

సీనియర్ సైంటిస్ట్-4

ప్రిన్సిపల్ సైంటిస్ట్-2


వయసు: సైంటిస్టులకు 32 ఏళ్లు, సీనియర్ సైంటిస్టులకు 37 ఏళ్లు, ప్రిన్సిపల్ సైంటిస్టులకు 45 ఏళ్లు మించకూడదు.

అర్హత: పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో ఎంఈ/ఎంటెక్ లేదా పీహెచ్‌డీ ఉత్తీర్ణత.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తుకు చివరితేదీ: జులై 30, 2019.

దరఖాస్తు ఫీజు: రూ.100.

చివరితేదీ: ఆగస్టు 14, 2019.

మరిన్ని వివరాలకోసం www.iictindia.org


మరింత సమాచారం తెలుసుకోండి: