మహాత్ముల జీవిత చరిత్రను పిల్లలకు పాఠాలుగా బోధించవలసిన పాఠశాలలే పిల్లలకు తప్పుడు అంశాలను నేర్పిస్తున్నాయి. కనీసం దేశ జాతి పితగా పేరొందిన మహాత్మా గాంధీ విషయంలోనే ఉపాధ్యాయులు తప్పటడుగులు వేస్తూనే ఈ విద్య విధానం ఎటుపోతుందనుకోవాలి? మొన్ననే గాంధీ జయంతి జరుపుకున్నాం. ఆయన జన్మదినం సందర్భంగా దేశమంతా మహాత్ముని స్మరించుకున్నాం.
తెల్ల దొరల నుండి దేశాన్ని రక్షించడానికి పోరాడిన వీరుడు ఆత్మహత్య చేసుకుంటాడా?


అదేంటి మహాత్మా గాంధీ ఆత్మహత్య చేసుకోవడమేంటి అనుకుంటున్నారా? గుజరాత్‌లోని ఓ పాఠశాల, కళాశాల విద్యార్థులకు నిర్వహించిన పరీక్షల్లో అడిగిన రెండు ప్రశ్నలు విద్యాశాఖ అధికారులనే అవాక్కయ్యేలా చేశాయి. గాంధీజీ హత్యకు గురయ్యారనే విషయం అందరికీ తెలిసిందే కానీ, ‘సుఫలాం శాల వికాస్‌ సంకుల్‌ పేరిట గుజరాత్‌లోని గాంధీనగర్‌లో నిర్వహిస్తున్న పాఠశాలలో 9వ తరగతి ఇంటర్నల్‌ పరీక్షలో ఈ ప్రశ్న అడిగారు’అని ఓ అధికారి తెలిపారు. 


కాగా మద్య నిషేధం ఉన్న గుజరాత్‌లో మద్యం విక్రయాలపై 12వ తరగతి విద్యార్థులను అడిగిన మరో ప్రశ్న సైతం అధికారులను ఇరుకున పడేసింది. ప్రభుత్వ నిధులు పొందే సెల్ఫ్ ఫైనాన్స్‌డ్ విద్యాసంస్థలకు చెందిన పాఠశాలలో తొమ్మిదో తరగతి విద్యార్థులకు ఇంటర్నల్ అసెస్‌మెంట్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. శనివారం జరిగిన పరీక్షలో గుజరాతీలో గాంధీజీ ఎలా ఆత్మహత్య చేసుకున్నారు? అని ఓ ప్రశ్న అడిగారు.  మరోవైపు 12వ తరగతి విద్యార్థుల పరీక్షలో మీ ప్రాంతంలో మద్యం విక్రయాలు పెరుగడం, సారా వ్యాపారులతో కలుగుతున్న ఇబ్బందులపై జిల్లా పోలీసు అధికారికి ఫిర్యాదు చేస్తూ లేఖ రాయండి అనే ప్రశ్న కనిపించింది. 



ఈ ప్రశ్నను చూసి ఆశ్చర్యపోయిన విద్యాశాఖాధికారులు దీనిపై విచారణ జరపాలని ఆదేశించారు. ఈ రెండు ప్రశ్న లు అభ్యంతరకరమైనవని, దీనిపై విచారణ ప్రారంభించామని, నివేదిక అందాక  దీనిపై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని గాంధీనగర్‌ జిల్లా విద్యాధికారి భరత్‌ వధేర్‌ వెల్లడించారు.
ఆయా ప్రశ్నపత్రాలను పాఠశాల యాజమాన్యాలే రూపొందించాయని చెప్పారు. వీటి తో విద్యాశాఖకు సంబంధంలేదని స్పష్టంచేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: