విదేశీ విద్యను చదవాలి అని చాల మంది విద్యార్థులకు కలలు ఉంటాయి. యూఎస్, యూకే, కెనడా, సింగపూర్...ఎక్కువ మంది విద్యార్థులు కలలు కనే దేశాలు ఇవి. ఈ దేశాలు భారతీయ విద్యార్థులను ఉన్నత బోధనా ప్రమాణాలు, నాణ్యమైన వసతులతో  ఆకర్షిస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాల  నుంచి విదేశాల్లో చదవడానికి వెళ్తున్న మనవాళ్ల సంఖ్య బాగా పెరిగిపోతుంది. ఒకప్పుడు పీజీ కోర్సులను అభ్యసించడానికి అమెరికాకు వెళ్లేవారు. కానీ ఇప్పుడు యూజీ కోర్సులకూ ఫారిన్ యూనివర్సిటీలకు వెళ్తున్నారు. అయితే ఏ దేశంలో చదవాలన్నా ఏదో ఒక పరీక్షలో మంచి స్కోర్ తెచ్చుకోవడం తప్పని సరిగా మారింది. జీఆర్‌ఈ, జీమ్యాట్, ఐఈఎల్‌ఎస్, ఎస్ఎటీ, టోఫెల్...ఇలా పరదేశీ చదువుల కోసం పరీక్షలెన్నో చాల ఉన్నాయి. 


ఇక టోఫెల్ గురించి తెలుసుకుందామా మరి...బెస్ట్ ఆఫ్ ఇన్ యూజ్ ఏ సాంగ్ లాంగ్వేజ్ కి సడు (టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఎ ఫారిన్ లాంగ్వేజ్) కి సంక్షిప్త రూపమే టోఫెల్. ఈ స్కోర్‌ను ప్రపంచవ్యాప్తంగా 9000 విద్యా సంస్థలు పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. దీంతో 130 దేశాల్లో చదువుకోవచ్చు. ఏటా సుమారు పది లక్షల మంది ఈ పరీక్షకు హాజరు అవుతున్నారు. 165 దేశాల్లో 4500 టోఫెల్ టెస్టు సెంటర్లు ఉన్నాయి.

పరీక్షను ఏడాది పొడవునా వివిధ తేదీల్లో సుమారు 40 రోజుల పాటు నిర్వహిస్తారు. భారత్ లో 13 పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. ఇంటర్నెట్ బేస్డ్, పేపర్ బేస్డ్ రెండు విధాలగానూ టోఫెల్ పరీక్షా నిర్వహిస్తారు . రిజిస్ట్రేషన్ ఫీజు 170 డాలర్లు. పరీక్షలో 4 సెక్షన్లు ఉంటాయి. వ్యవధి నాలుగున్నర గంటల సమయం. ఎన్ని సార్లైనా పరీక్షను రాసుకోవచ్చు . స్కోరు రెండేళ్లపాటు చెల్లుబాటవుతుంది. పూర్తి వివరాల కోసం వెబ్ సైట్: www.ets.org/toefl చూడొచ్చు .


ఇక నుంచీ టో ఫెల్ (టెస్ట్ ఆఫ్ ఇంగ్లిష్ యాజ్ ఎ ఫారిన్ లాంగ్వేజ్) రాసే విద్యార్థులు 6 రోజుల్లోనే వారి స్కోరును తెలుసుకోవచ్చు. ఇప్పటిదాకా స్కోర్లను తెలుసుకోవడాని కి  పది రోజుల ఉండేది. ఇప్పుడు ఈ పరీక్ష రాయాలనుకున్న విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకునేందుకు అధికారికంగా 'టో ఫెల్ యాప్ కూడా  అందుబాటులోకి రావడం జరిగింది.


మరింత సమాచారం తెలుసుకోండి: