కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అంటే మాటలు కాదు.. వారానికి ఐదు రోజుల పని దినాలు.. క్రమం తప్పకుండా వచ్చే ఇంక్రిమెంట్లు, బోనస్ లు, ఇంకా సకల సదుపాయాలు. అందుకే అంతా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అంటే అంతగా ఆశపడతారు. అలాంటి 700 వరకూ ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసేందుకు ఇవాళే ఆఖరి తేదీ.


అవేంటో చూద్దాం.. ఎయిర్ ఇండియాలో ఉద్యోగాల భర్తీ కోసం విడుదలైన నోటిఫికేషన్‌కు నవంబర్ 5 చివరి తేదీ. మొత్తం నాలుగు రీజియన్లలో కలిపి మొత్తం 170 అసిస్టెంట్ సూపర్‌వైజర్ పోస్టులు ఉన్నాయి. వీటి భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. పూర్తి వివరాలకు aiesl.airindia.in వెబ్ సైట్ చూడొచ్చు.


ఇక దేశం గర్వించే మరో కేంద్ర ప్రభుత్వ సంస్థ ఇస్రో. శాస్తవేత్తలుగా దేశాన్ని ప్రగతి పథంలో నడిపించే అవకాశం ఇక్కడ లభిస్తుంది. ఇస్రోలో దాదాపు 327 సైంటిస్ట, ఇంజినీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. దీనికి కూడా చివరి తేదీ నవంబర్ 5. వివరాలకు isro.gov.in వెబ్ సైట్ చూడొచ్చు.


ఇక పశ్చిమ మధ్య రైల్వేలో 160 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి కూడా నేడే చివరి తేదీ. వివరాలకు wcr.indianrailways.gov.in వెబ్ సైట్ చూడొచ్చు. మీకు తగిన అర్హతలు ఉంటే.. ఈ రోజే తప్పక దరఖాస్తు పెట్టుకోండి. ఆల్ ద బెస్ట్.


మరింత సమాచారం తెలుసుకోండి: