ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన పాలనతో ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి వైపు పరిగెత్తిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన సమయం నుంచి తన జీవితం ప్రజలకోసమే అని గడుపుతూ.. ఆంధ్ర రాష్ట్రంలో పసి పాప నుండి వయో వృద్ధుడు వరుకు ప్రతి ఒక్కరికి ఉపయోగ పడే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. 

 

ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తున్నారు. కేవలం సీఎం జగన్ నాలుగు నెలల పాలనలోనే నాలుగు లక్షల మందికి ఉపాధి కల్పించారు. ఎంతో మంది ప్రభుత్వ ఉద్యోగులకు వేతనం భారీగా పెంచారు. ఇలా ప్రజలకు వరాలు ఇస్తూ వెళ్తున్నారు సీఎం జగన్. ఈ నేపథ్యంలోనే ఏపీలోని చిత్తూరు జిల్లా మహిళాభివృద్ధి & చైల్డ్ వెల్ఫేర్ విభాగం అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు.  

 

ఈ నోటిఫికేషన్ ద్వారా అంగన్వాడీ వర్కర్ (టీచర్), అంగన్వాడీ హెల్పర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. 10వ తరగతి అర్హత ఉన్న ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వివాహితులై ఉండాలి. సరైన అర్హతలు ఉన్న అభ్యర్థులు నవంబరు 21 అంటే గురువారం నుండి 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

 

అయితే ఈ అంగన్వాడీ ఉద్యోగాల పూర్తి వివరాలు. మొత్తం 489 పోస్టులు ఖాళీలు ఉండగా అందులో అంగన్వాడీ కార్యకర్త (వర్కర్) 63 పోస్టులు, మినీ అంగన్వాడీ కార్యకర్త (వర్కర్) పోస్టులు 83, అంగన్వాడీ సహాయకులు (హెల్పర్) పోస్టులు 343 ఉన్నాయి. అయితే ఈ పోస్టులకు అర్హతలు పదోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి.

 

వివాహితులైన స్థానికులు మాత్రమే ఈ పోస్టులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అంటే అంగన్వాడీ ఉన్న గ్రామంలో స్థానికులై ఉండాలి. కాగా ఈ పోస్టులకు వయోపరిమితి 01.07.2019 నాటికి 21 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లో 21 సంవత్సరాలు ఉన్న అభ్యర్థులు అందుబాటులో లేని పక్షంలో 18 సంవత్సరాలు నిండినవారు కూడా అర్హులు.

మరింత సమాచారం తెలుసుకోండి: