ఇటీవలే కాలంలో రైల్వే శాఖలో భారీ నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అందులో ఉన్న రైల్వే జోన్లు రైల్వే వర్క్‌షాప్స్‌లో అప్రెంటీస్ పోస్టుల్ని భర్తీ చేస్తున్నరు. వీటికి సంబంధించి కూడా ఇప్పటికే నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఇటీవల సికింద్రాబాద్ కేంద్రంగా దక్షిణ మధ్య రైల్వేలో కూడా 4103 అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. 

 

ప్రస్తుతం ఈ పోస్టులకు దరఖాస్తుల్ని కూడా స్వీకరిస్తోంది. అంతేకాదు దక్షిణ మధ్య రైల్వేలోని ఆరు డివిజన్లలో 24 యూనిట్లలో ఈ పోస్టులు భర్తీ కానున్నాయి. ఈ పోస్టులే కాకా ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, డీజిల్ మెకానిక్, వెల్డర్, ఏసీ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్ వాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది రైల్వే శాఖ. అయితే ఈ నోటిఫికేషన్ విషయంలో అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులు. 

 

రైల్వే అప్రెంటీస్ పోస్టుల భర్తీలో తెలుగువారికి అన్యాయం జరుగుతోందని వారు వాదిస్తున్నారు. సాధారణంగా ఏ జోన్‌లో రైల్వే ఉద్యోగాలు భర్తీ చేస్తున్నా దేశంలోని అన్ని ప్రాంతాలవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పుడు దక్షిణ మధ్య రైల్వే జారీ చేసిన అప్రెంటీస్ నోటిఫికేషన్‌కు కూడా ఇదే వర్తిస్తుంది. దేశంలోని ఏ ప్రాంతానికి చెందిన అభ్యర్థులైనా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది దక్షిణ మధ్య రైల్వే. 

 

ఇప్పుడు ఈ అవకాశమే స్థానిక అభ్యర్థుల ఆందోళనకు కారణమైంది. మొన్న ఈ మధ్యకాలంలో చెన్నై కూడా సదరన్ రైల్వేలో అప్రెంటిస్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది కానీ అందులో వారు ఆ నోటిఫికేషన్ కు ఆ జోన్ అభ్యర్థులు మాత్రమే అర్హులు అని వారు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి అని నిబంధన పెట్టింది. దీంతో ఆ పోస్టుకు ఆ జోన్ వారు తప్ప ఎవరికి దరఖాస్తు చేసుకునే అవకాశం ఇవ్వలేదు. 

 

అయితే సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే జారీ చేసిన అప్రెంటీస్ నోటిఫికేషన్‌లో మాత్రం దేశంలో ఉన్న నిరుద్యోగులు అంత దరఖాస్తు చేసుకోవచ్చు. దీని వల్ల వారికీ అన్యాయం జరుగుతుంది అని తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు విడుదల చేసిన నోటిఫికేషన్ రద్దు చేసి కేవలం స్థానికులకు మాత్రమే అవకాశం కల్పిస్తూ కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మరి తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులు కోరిక మేరకు నోటిఫికేషన్ రద్దు చేస్తుందా ? అసలు స్పందిస్తుందా ? అనేది చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: