ప్రభుత్వ పాఠశాలలు ఎన్నో సంవత్సరముల నుంచి  తలవంచుకునే బతికేస్తూన్నాయి. ప్రైవేటు స్కూళ్ల యొక్క వేగమును  అందుకోలేక బాధ పడుతూనే ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల పరిస్థితి కూడా అంతే. ఏదైనా ఉద్యోగానికి వెళితే అక్కడ జరిపే ఇంటర్వ్యూలలో, గ్రూప్‌ డిస్కషన్లలో, పోటీ పరీక్షల సమయంలో ‘కార్పొరేట్‌ స్కూల్  పిల్లలతో పోటీ ఎదుర్కోలేక చతికిలపడుతూనే ఉన్నారు. ఈ కాలంలో ఎన్ని తెలివితేటలు ఉన్నా ఆంగ్లంలో సంభాషించలేక పోవడం వల్ల అనేక అవమానాలు ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇన్నాళ్లకు ప్రాథమిక స్థాయి నుంచే ఇంగ్లీష్‌ బోధించాలని సర్కారు సంకల్పంతో ఉన్నది.

 

మరుసటి సంవత్సరం నుంచి ప్రతి ప్రాథమిక పాఠశాలలో తప్పనిసరిగా ఇంగ్లీషు బోధన మాధ్యమం లోనే బోధన జరగాలని శాసనసభలో బిల్లును కూడా ప్రవేశపెట్టింది. అయితే దీనిపై ప్రతిపక్షాల నుంచి ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. నిజానికి విమర్శించే వారి పిల్లలంతా విదేశాల్లోనూ,పెద్దపెద్ద కార్పొరేట్ పాఠశాలలోనే ఇంగ్లిష్‌ మీడియంలోనే చదువుతుండడం గమనించదగ్గ విషయం. ఇంటిలో పిల్లలను ఇంగ్లీష్ మీడియంలో చదివిస్తూన్నారు. మరి సామాన్య ప్రజల యొక్క పిల్లలు మాత్రము తెలుగు మీడియా లోచదివి రేపు పొద్దున మా పిల్లలకు పోటీకి రాకూడదు అన్న భావనతో ఉన్నారు. సామాన్యుల పిల్లల విషయంలో మాత్రం కొత్త భాష్యాలు పలుకుతున్నారు. వీరి అవలంబిస్తున్న ద్వంద్వ పద్ధతి రాజకీయాలపై జనంలో ఎక్కువ అసహనం వ్యక్తమవుతోంది.

 

ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలు ఉన్నత స్థాయికి వెళ్లాలని మంచి ఉద్యోగములో ఉండాలని కోరుకుంటారుఏ ఫారిన్ లోనూ జాబ్ చేస్తున్నా వాళ్లను చూసి మేము కూడా అలాగే స్థిరపడాలని కలలు కంటారు. దాని కోసం కష్టనష్టాలను భరించి, తిన్న తినకపోయినా, పిల్లల్ని మాత్రము చదివిస్తుంటారు. కంప్యూటర్‌ యుగంలో ఇంగ్లీష్‌ రాకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తున్నది. 

 

ఇంగ్లీషు రాకపోతే ఉపాధి, ఉన్నతి రెండూ లేవన్నది జగమెరిగిన సత్యం. ఎక్కడకు వెళ్లి రాణించాలన్నా ఇంగ్లీష్ భాషలో ప్రావీణ్యం తప్పనిసరిగా మారుతున్న రోజులు ఇవి. ఇంతటి ప్రాధాన్యత సంతరించుకున్న విద్యను నాణ్యతతో పేదలందరికీ కూడా ఉచితంగా అందించేందుకు ప్రభుత్వము సంకల్పిస్తుంటే ప్రతిపక్ష పార్టీ నాయకులు మాత్రం ఎందుకో వ్యతిరేకిస్తున్నారు.  ప్రభుత్వ నిర్ణయాన్ని ఓ వైపు వ్యతిరేకిస్తూనారు. 


ఈ నిర్ణయం వెలువడినప్పటి నుంచి టీడీపీ, జనసేన నాయకులు తీవ్రస్థాయిలో కొంపలు మునిగిపోయినట్లు, వ్యతిరేకిస్తున్నారు. కానీ అచ్చె న్న వంటి వారంతా తమ పిల్లలను మాత్రం ఎంచక్కా కార్పొరేట్‌ స్కూళ్లలో, ఆంగ్ల మీడియంలో చదివించుకుంటున్నారు. దీనిపై ప్రజలే అపోజిషన్ నాయకులను ఎదురుగా నిలబెట్టి  అడగాలని అభ్యుదయవాదులు, సామాన్య ప్రజలు కూడా తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: