ఆంధ్రా యూనివర్శిటీ.. ఆంధ్రప్రదేశ్‌కు ఏయూ గర్వకారణం. విశిష్ట మేధావుల్ని అందించిన మహోన్నత విశ్వవిద్యాలయం. కానీ.. చదువుల దేవాలయమైన ఆంధ్ర విశ్వవిద్యాలయం

దేశంలో 14వ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో మొదటి యూనివర్సిటీ ఇది.

 

ఈ వర్శిటీకి ప్రోత్సాహం కరవైంది. ప్రభుత్వం నుంచి సహకారమూ అంతంత మాత్రంగానే ఉంది. ఆంధ్రా విశ్వ విద్యాలయంలో బోధనా సిబ్బంది ఖాళీలు 459 వరకు ఉన్నాయి. ఇంకెన్నో సమస్యలు ఉన్నాయి. ఇటీవల ఈ యూనివర్శిటీని సందర్శించిన సీఎం జగన్.. ఆంధ్రా విశ్వ విద్యాలయాన్ని ఆదుకుంటామన్నారు.

 

ఏయూని దేశంలో మొదటి 5 విశ్వ విద్యాలయాల్లో ఒకటిగా నిలబెడతామన్నారు. మరి జగన్ ఆ మాట ఎంత వరకూ నిలబెట్టుకుంటారో చూడాలి. సమస్యల నిలయంగా ఉన్న వర్శిటీని తీర్చిదిద్దాలి. విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఆదిమూలపు సురేశ్ కు ఇక్కడి సమస్యలపై సరైన అవగాహన ఉంది. సర్కారు తలచుకుంటే టాప్ 5లో నిలబెట్టడం పెద్ద సమస్యే కాదంటున్నారు విద్యావేత్తలు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: