కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉండే వివిధ ఉద్యోగాల భర్తీ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారానే జరుగుతుంది. తాజాగా ఈ కమిషన్ నుంచీ  భారీ నోటిఫికేషన్ వెలువడనున్నట్టుగా తెలుస్తోంది. అయితే లెవిల్ –CGL 2018  పరీక్ష రాసిన వారికి మాత్రం ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి . ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 11,271 ఉద్యోగాలని భర్తీ చేయనుంది. అంతేకాదు గతంలో రిలీజ్ హేసిన నోటిఫికేషన్ కి సంభందించి ఖాళీలని వరుసగా ప్రకటిస్తోంది.

 

కొన్నో రోజుల క్రితం ఢిల్లీ పోలీస్, సిఏపీఎఫ్ లో సబ్ ఇన్స్పెక్టర్ వంటి పలు ఉద్యోగాల  భర్తీ చేస్తున్నట్టుగా ప్రకటించింది. ఇప్పుడు కంబైండ్ గ్రాడ్యుయేషన్ లెవిల్ – 2018 నోటిఫికేషన్ ద్వారా 11,271 లని ప్రకటించింది. ఈ మొత్తం పోస్టులలో వివిధ విభాగాల వారీగా పరిశీలిస్తే కంట్రోలర్ జనరల్ ఆఫ్ డిఫెన్స్ అకౌంట్స్ విభాగంలో సుమారు 3,082 పోస్తులని భారీ చేయనుంది. అలాగే...

 

సెంట్రల్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పోస్టులు సుమారు 1729 ఉన్నాయి. అలాగే మిగిలిన పోస్టులు వివిధ విభాగాల్లో ఉన్నాయి. డిసెంబర్ 29 వ తేదీన ఈ నోటిఫికేషన్ కి సంభందించి మూడోదశ ప్రక్రియ కొనసాగుతుందని తెలుస్తోంది. ఈ ఉద్యోగాల గూర్చి మరిన్ని వివరాలకోసం క్రింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేసి తెలుసుకోవచ్చు


https://ssc.nic.in/SSCFileServer/PortalManagement/UploadedFiles/Tentative_vacancy_CGLE_2018_dt%2027_12_2019.pdf

మరింత సమాచారం తెలుసుకోండి: