నూతన సంవత్సరం నిరుద్యోగులకి వరంగా మారింది. ఎన్నో ఏళ్ళ నుంచీ పోటీ పరీక్షలకి సిద్దమవుతున్న ఎంతో మంది నిరుద్యోగ యువతికి ఈ ఏడాది పండగే పండగని అంటున్నారు విద్యా నిపుణులు.బ్యాంకింగ్ రంగం మొదలు,కేంద్ర ప్రభుత్వ , రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉద్యోగాలు ఇలా లెక్కకి మించిన నోటిఫికేషన్లు విడుదలవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే తాజాగా బ్రాడ్ క్యాస్ట్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ BECIL ఓ భారీ నోటిఫికేషన్ విడదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా సుమారు 4000 వేల పోస్టులని భర్తీ చేయనుంది. పూర్తి వివరాలలోకి వెళ్తే..
మొత్తం ఖాళీలు : 4000
స్కిల్డ్ మ్యాన్ పవర్ : 2000
అన్ స్కిల్డ్ మ్యాన్ పవర్ : 2000
అర్హతలు : ఎనిమిదో తరగతి తో పాటుగా ఐటిఐ పాస్ అయ్యి ఉండాలి.
వయస్సు : 18 -25 ఏళ్ళ మధ్య ఉండాలి.
ఫీజు : జనరల్ ఓబీసీ అభ్యర్దులకి రూ.500/- ఎస్సీ, ఎస్టీ వికలాంగులకి 250
ముఖ్య తేదీలు
దరఖాస్తు విధానం : ఆన్లైన్
దరఖాస్తు ఆన్లైన్ తేదీ : 27-12-2019
దరఖాస్తు చివరి తేదీ : 11-01-2020
దరఖాస్తు అప్ప్లై చేయాలనుకునే వారు ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి.