ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏపీలోని నిరుద్యోగ యువతీ యువకులకి తీపి కబురు చెప్పారు. గ్రామ సచివాలాయల పేరుతో ఎక్కడా లేని విధంగా నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ, వారి సొంత జిల్లాలోనే ఉద్యోగాలని చేసుకునే విధంగా ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ ఉద్యోగాలలో మరిన్ని ఉద్యోగాలని భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.  

 

ఇప్పటికే ఈ ఉద్యోగాలకి ఎంపిక కాబడిన వాళ్ళు తమ తమ స్వస్థలలో ఉద్యోగాలు చేసుకుంటూ ఇళ్ళకి దగ్గరగా ఉంటూ ఎంతో ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. ఎంతో ఉన్నతమైన ప్రవైటు ఉద్యోగాలు చేసుకుంటూ వేలలో జీతం సంపాదించే వారు సైతం గ్రామా సచివాలయ ఉద్యోగాల కోసం పోటీ పడుతున్నారు. అయితే జగన్ ఆదేశాల ప్రకారం..

 

ఈ ఆర్ధిక సంవత్సరం ముగిసేలోగానే కొత్త ఉద్యోగాలని భర్తీ చేయడానికి సర్వం సిద్దమవుతోంది. గత నోటిఫికేషన్ లో మిగిలిన ఉద్యోగాలంటే కూడా అదనంగా మరో 3000 వేల ఉద్యోగాలని భర్తీ చేస్తూ, ప్రస్తుతం సచివాలయాలలో ఖాళీగా 15,971 పోస్టులని కలిపి ఈ సారి మొత్తం 18,971 భారీ ఉద్యోగాలతో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అనుకున్నట్టుగా అన్నీ జరిగితే ఏప్రియల్ లోనే ఈ నోటిఫికేషన్ విడుదల చేయడానికి సిద్దమవుతున్నారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: