ఈ మధ్యకాలంలో ఉద్యోగాలు ఎక్కడ అంటే అక్కడ ఉంటున్నాయి. ఇంకొంత కాలం పోతే నిరుద్యోగ సమస్య పోతుంది ఏమో అనిపిస్తుంది. అన్ని చోట్ల కొలువులు ఉంటున్నాయి. ఇంకా పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రైవేట్ రంగంలోని దిగ్గజ బ్యాంకు ఆయన యాక్సిస్ బ్యాంకులో 15,000 మంది ఉద్యోగులకు ఖాళీలు ఉన్నాయి. గత రెండు రోజుల నుండి ఉద్యోగాలు భర్తీ చేయనున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. 

 

యాక్సిస్ బ్యాంకులో కొందరు ఉద్యోగులు రాజీనామా చేసినట్టు మూడు రోజుల ముందే వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటికే వారి స్థానాల్లో యాక్సిస్ బ్యాంకులో 28,000 మంది ఉద్యోగులను నియమించుకున్నట్టు తాజాగా వార్తలు వస్తున్నాయి. అంతేకాదు.. మరికొన్ని నెలల్లో మరో 4వేల మందిని యాక్సిస్ బ్యాంకు నియమించుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. 

 

యాక్సిస్ బ్యాంక్ నుండి గత కొద్దీ కాలంగా మిడ్ లెవెల్, సీనియర్ లెవెల్ ఉద్యోగులు భారీగా వెళ్లిపోతున్నారు. యాక్సిస్ బ్యాంకులో చాలాకాలంగా పనిచేస్తున్న ఉద్యోగులు అసౌకర్యంగా భావిస్తున్నారని, అందుకే వెళ్లిపోతున్నారన్న వార్తలు వస్తున్నాయి. అందుకే గత కొద్దీ కాలం నుండి ఉద్యోగులు అందరూ రాజీనామాలు చేశారు. దీంతో 15వేల మంది ఉద్యోగులు వెళ్లిపోయారట. ఈ నేపథ్యంలోనే ఆలా వెళ్ళిపోయినా వారితో పాటు.. వారి స్థానాల్లో మరికొంతమంది ఉద్యోగులను భర్తీ చెయ్యనున్నారు. ఇప్పటికే 28వేలమందిని నియమించగా త్వరలోనే 4,000 పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. సెమీ అర్బన్, టైర్ 2, టైర్ 3, గ్రామీణ ప్రాంతాల్లో నియమించనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: