నిరుద్యోగులకు ఇదో చక్కటి అవకాశం. పది, ఇంటర్, డిప్లమో, డిగ్రీ మీ క్వాలిఫికేషన్ ఏదైనా సరే.. ఫ్రీ ట్రైనింగ్ ఇస్తారు. అంతే కాదు.. ఉద్యోగం కూడా చూపిస్తారు. ఇదేదో బావుంది కదా.. వివరాలేంటంటే.. ? హైదరాబాద్ మాదాపూర్‌లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్.. న్యాక్, ఈజీఎంఎం సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువతకు నిర్మాణ రంగానికి సంబంధించిన పలు కోర్సుల్లో ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తారట.

 

శిక్షణ అనంతరం న్యాక్ ధ్రువీకరణ పత్రం ఇవ్వడంతో పాటు ప్రైవేటు రంగంలో జాబ్ ఇప్పిస్తారు. నిర్మాణ రంగానికి సంబంధించిన ఎలక్ట్రికల్ అండ్ హౌజ్ వైరింగ్, ప్లబింగ్ అండ్ శానిటేషన్, వెల్డింగ్, డైవాల్ అండ్ ఫాల్స్ సీలింగ్, పెయింటింగ్ అండ్ డెకరేషన్, ల్యాండ్ సర్వే, స్టోర్ కీపర్ కోర్సుల్లో మూడు నెలల పాటు ట్రైనింగ్ ఇస్తారు.

 

సూపర్ వైజర్ స్ట్రక్చరల్ కోర్సులో నాలుగు నెలల శిక్షణ ఉంటుంది. కనీసం పదో తరగతి ఉత్తీర్ణులైన యువత ఆయా కోర్సుల్లో చేరేందుకు అర్హులు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు తమ విద్యాపత్రాలు, ఫొటోలు, గుర్తింపుకార్డుతో మాదాపూర్‌లోని న్యాక్ కార్యాలయానికి రావాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు ఫోన్ నెంబర్లు 798905 0888, 83286 22455 ఫోన్ నెంబర్లలో సంప్రదించొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: