ప్లాస్టిక్.. ఎంతగా పర్యావరణానికి హానికలిగిస్తుందని చెబుతున్నా.. ప్లాస్టిక్ లేకుండా బతికే పరిస్థితి లేదు. అంతగా మన జీవితాల్లో అవసరమైపోయింది. అందుకే ప్లాస్టిక్ తయారీ రంగం ఓ ప్రధాన ఉపాధి వనరుగా మారింది. అలాంటి ప్లాస్టిక్ రంగంలో ఉపాధి అవకాశాలకు మెరుగు పరిచే కోర్సే సిపెట్.

 

ఈ కోర్సులో అడ్మిషన్ల కోసం సిపెట్ జేఈఈ-2020 నోటిఫికేషన్ వచ్చేసింది. చెన్నై ప్రధాన కేంద్రంగా ఉన్న సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ. ఇందులో అడ్మిషన్ కోసం దేశవ్యాప్తంగా 2020 విద్యా సంవత్సరానికి జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జే ఈఈ) ద్వారా కింది ప్రోగ్రాముల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ వచ్చింది.

 

సిపెట్ జేఈఈ ద్వారా కోర్సులు ఏంటంటే.. డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ మౌల్డ్ టెక్నాలజీ, డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ టెక్నాలజీ, పోస్టు గ్రాడ్యుయేట్, డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ ప్రాసెసింగ్ అండ్ టెస్టింగ్, పోస్టు డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ మౌల్డ్ డిజైన్.

 

ఈ కోర్సులకు పదోతరగతి, సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది. పరీక్షతేది: మే 31, 2020. దరఖాస్తుకు చివరితేది: మే 22, 2020. మరిన్ని వివరాల కోసం https://eadmission.cipet.gov.in/ చూడొచ్చు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: