అమెజాన్..ప్రపంచంలో ఈ కామర్స్ రంగంలో దూసుకుపోతున్న అతిపెద్ద సంస్థ. ఈ సంస్థ సిఈవో జెఫ్ బెజోస్ ఓ సంచలన ప్రకటన చేశారు. భారత్ లో రానున్న రోజుల్లో అంటే 2025 నాటికి సుమారు 10 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని ప్రకటించారు. ఆసియాలోనే మూడో అతిపెద్ద ఆర్ధిక వ్యవస్థగా పేరొందిన భారత దేశంలో తాము మరింతగా మా కార్యకలాపాలు నిర్వహించేందుకు త్వరలో 1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్టుగా ఆయన తెలిపారు..

 

అమెజాన్ వ్యాపారాన్ని భారత్ లో పెంచడం ద్వారా ఉద్యోగాలు, ఎగుమతులు, పెట్టుబడులు పెంచుతామని అన్నారు. ఐటీ , స్కిల్ డెవలప్మెంట్ , రీటైల్, కంటెంట్ క్రియేషన్,లాజిస్టిక్ తయారి రంగాలలో తాము భారీగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇదిలాఉంటే ఇప్పటికి అమెజాన్ భారత్ లో పెట్టిన పెతుబడులు ద్వారా సుమారు 7 లక్షల మందికి ఉపాది దొరికింది. అయితే

 

గత పెట్టుబడులకంటే కూడా ఇప్పుడు పెట్టుబడులు అధికశాతం ఉంటాయి కాబట్టి తప్పకుండా వచ్చే 2025 కల్లా 10 లక్షల ఉద్యోగాలు కల్పించి తీరుతామని అన్నారు. ఇప్పటికే అమెజాన్ భారత్ లో మారుమూల ప్రాంతాల వారికి కూడా విస్తృతం అయ్యింది. ఈ దృష్ట్యా అమెజాన్ కార్యకలాపాలు మరింతగా భారతదేశం నలుమూలల విస్తరించేలా చేయస్తామని అమెజాన్ ప్రకటించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: