ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  పదవ తరగతి పరీక్ష ఫీజుకు  తాజాగా తత్కాల్ స్కీమ ను ప్రవేశపెట్టారు. ఫిబ్రవరి 10 లాస్ట్ డేట్ . పదవ తరగతి పరీక్షల ఫీజు చెల్లించడానికి విద్యార్థిని  విద్యార్థులకు మరో అవకాశం కలిపించారు ప్రభుత్వం. ఎగ్జామ్ ఫీజు చెల్లించడానికి కొత్తగా  తత్కాల్ స్కీమ్ ప్రకటించారు . రెగ్యులర్ విద్యార్థులతో పాటు 2017 నుంచి 2019 మధ్య కొత్త ప్యాటర్న్‌లో ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా  ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఫీజు చెల్లించొచ్చు అని తెలిపారు.

తత్కాల్ స్కీమ్‌లో ఎగ్జామ్ ఫీజు చెల్లించి, 2020 మార్చిలో జరిగే పదవ తరగతి పరీక్షలు హాజరు కావచ్చు అని చెప్పారు. విద్యార్థులు 2020 ఫిబ్రవరి 10 లోగా ఫీజు చెల్లించాలి,అదే చివరి అవకాశం . పరీక్ష ఫీజుతో పాటు ఆలస్య రుసుము రూ.1,000 అదనంగా  చెల్లించాలి.  ఆంధ్రప్రదేశ్‌లో 2020 మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు టెన్త్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. ఉదయం 9.30 గంటల సమయం  నుండి  మధ్యాహ్నం 12.15 గంటల  సమయం వరకు పరీక్షలు జరుగుతాయి.


ఏపీలో టెన్త్ ఎగ్జామ్ షెడ్యూల్ ఇలా ఉంది..

మార్చి 23- ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 1
మార్చి 24- ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 
మార్చి 26- సెకండ్ లాంగ్వేజ్
మార్చి 27- ఇంగ్లీష్ పేపర్ 1
మార్చి 28- ఇంగ్లీష్ పేపర్ 2
మార్చి 30- గణితం పేపర్ 1
మార్చి 31- గణితం పేపర్ 2
ఏప్రిల్ 1- సైన్స్ పేపర్ 1
ఏప్రిల్ 3- జనరల్ సైన్స్
ఏప్రిల్ 4- సోషల్ స్టడీస్ పేపర్ 1
ఏప్రిల్ 6- సోషల్ స్టడీస్ పేపర్ 2
ఏప్రిల్ 7- సంస్కృతం, అరబిక్, పర్షియన్
ఏప్రిల్ 8- వొకేషనల్ పరీక్షలు తాలూకు పూర్తి షెడ్యూల్..

మరింత సమాచారం తెలుసుకోండి: