2030 నాటికి అత్యధికంగా పనిచేయగలిగిన యువత ఉండే దేశంగా ఒక్క భారత్‌ మాత్రమే నిలవనుంది. అది దృష్టిలో పెట్టుకునే దేశ విద్యార్థిని విద్యార్థులకు అనువుగా వుండే పధక రచన చేశారు. దేశవ్యాప్తంగా స్థానిక సంస్థల్లో ఇంజినీరింగ్‌ విద్యార్థులకు అప్రెంటీస్‌ విధానాన్ని ప్రెవేశ పెడతామని ఈ సందర్భంగా నిర్మల సీతారామన్ పేర్కొనడం విద్యార్థినీవిద్యార్థులను ఎంతో లాభదాయకం. దేశంలో వైద్య నిపుణుల కొరత తీర్చేందుకు కొత్త విధి విధానాలను తయారు చేశారు. 

 

ప్రతి జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రికి అనుబంధంగా పీపీపీ విధానంలో వైద్య కళాశాలలు ఏర్పాటు విధానం చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ విద్య అవసరం మేరకు భూమి సౌకర్యం కల్పించే రాష్ట్రాలకు కేంద్రం నుంచి పెద్ద మొత్తంలో సాయం వెలువరించబడుతుందని మాటిచ్చారు. ఇంజనీరింగ్ కాలేజీలలో ఫీజులను తగ్గించేందుకు విద్యాశాఖ కసరత్తులు ప్రారంభించిందని, గతంలో కన్నా తక్కువగా ఉంటాయని.. ఈసారి కేవలం విద్య కోసం ఖర్చు చేసే వ్యయాన్ని మాత్రమే పరిగణలోకి తీసుకుని ఫీజులను నిర్ణయిస్తామని పేర్కొన్నారు.

 

కాలేజీల్లో ఉండే సౌకర్యాలు, ప్రమాణాలు, వసతులను దృష్టిలో పెట్టుకుని ఫీజులను నిర్ణయిస్తామని, అటు మెడికల్, ఫార్మా కాలేజీల్లో కూడా కమిషన్ బృందాలు తనిఖీలు చేస్తుండగా.. వాటి ఫీజుల విధానంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం... అని పేర్కొన్నారు. యూజీ, పీజీ, డిగ్రీ కోర్సులు, లా కోర్సులు, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కోర్సుల ఫీజులను కూడా ఉన్నత విద్యా నియంత్రణ, పర్యవేక్షణ కమిషనే ఖరారు చేస్తుంది అని తెలియజేసారు.

 

ఇక ఈ ఏడాది ఫీజుల నిర్ణయంలో కొంత జాప్యం కలగడం వల్ల 2020-21, 2022-23 విద్యాసంవత్సరాలకు కూడా ఈ నిర్ణయం వర్తిస్తుందని, చెప్పారు. డిగ్రీ, పీజీ కోర్సులకు ఒకే రకమైన ఫీజుల అమలౌతాయని, కన్వీనర్‌, మేనేజ్‌మెంట్ కోటాలో చేరే విద్యార్థులకు కమిషన్ నిర్ధారించిన ఫీజులను మాత్రమే వసూలు చేయాలని పలికారు. అలా కాదని నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు అని ఖరాఖండిగా చెప్పారు. 
అంతేకాకుండా విద్యాసంస్థలు అక్రమాలకు పాల్పడితే ప్రజలు ఫిర్యాదు చేసేందుకు టోల్‌ఫ్రీ నంబర్‌తో పాటు గ్రీవెన్స్‌ సెల్‌‌ను కూడా ఏర్పాటు చేయనున్నాం... అని ఈ సందర్భంగా వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: