అన్ని ఉద్యోగాలకూ రాత పరీక్షలు ఉండవు. కొన్ని ఉద్యోగాలు అకడమిక్ మెరిట్ పై కూడా ఇచ్చేస్తారు. అలాంటిదే ఈ ఉద్యోగం. కాకపోతే ఇంటర్వ్యూ ఉంటుంది. వివరాల్లోకి వెళ్తే.. మైసూరులోని సీఎఆర్-సెంట్రల్ ఫుడ్ టెక్నలాజికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎసీఆర్‌).. సైంటిస్టు ఉద్యోగాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఈ దరఖాస్తుల స్వీకరణ జనవరి 8 నుంచి మొదలైంది. నేటి వరకూ.. అంటే.. ఫిబ్రవరి ఆరు వరకూ అప్లయ్ చేసుకోవచ్చు.

 

ఇందులో మొత్తం 31 పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి. అవేమిటంటే.. సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట్, ప్రిన్సిపల్ సైంటిస్ట్ పోస్టులు ఈ 31 పోస్టుల్లో సైంటిస్ట్-25, సీనియర్ సైంటిస్ట్-03, ప్రిన్సిపల్ సైంటిస్ట్-08గా ఉన్నాయి. ఇక అర్హతల విషయానికి వస్తే.. పోస్టుని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లోఎంఈ / ఎంటెక్, పీహెచ్డీ ఉత్తీర్ణత ఉండాలి. అనుభవం కూడా పరిగణనలోకి తీసుకుంటారు.

 

 

ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఆన్‌ లైన్‌ ద్వారా లేదా ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిఉంటుంది. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు నేడే చివరి తేదీ.. అయితే దరఖాస్తు హార్డ్ కాపీలు పంపడానికి చివరితేదీ: ఫిబ్రవరి 21, 2020. మరిన్ని వివరాల కోసం https://cftri.res.in/ అనే వెబ్ సైట్ ను చూడవచ్చు. మీకు అర్హత ఉంటే త్వరపడండి మరి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: