యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ CSE – 2020 కి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ లో భాగంగా సుమారు 796 ఉద్యోగాలని భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా IAS, IPS , IFS వంటి ప్రతిష్టాత్మక ఉద్యోగాలు భర్తీ కాబడుతాయి. ఈ క్రమంలోనే IFS ఉద్యోగాలని నోటిఫికేషన్ విడుదల చేసింది.సుమారు 90 పోస్టులని భర్తీ చేస్తోంది.
ఈ పోస్టులకి దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ప్రిలిమినరీ రాతపరీక్ష రాసిన తరువాత అందులో ఉత్తీర్ణులు అయితే తదుపరి నిర్వహించే మెయిన్స్ పరీక్షకి అర్హులు అవుతారు. ఆ తరువాత ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. ఇండియన్ సివిల్ సర్వీస్ కి అలాగే ఫారెస్ట్ సర్వీస్ కి దరఖాస్తు మాత్రం ఒక్కటే ఉంటుంది. ఈ నోటిఫికేషన్ పూర్తి వివరాలలోకి వెళ్తే..
మొత్తం ఖాళీలు : 90
ఆన్లైన్ లో దరఖాస్తులు మొదలుగు తేదీ : 12-02-2020
దరఖాస్తు చివరి తేదీ : 03-03-2020
వయసు : 21- 32
దరఖాస్తు ఫీజు : రూ. 100. ప్రభుత్వ నిభందనలు కలిగిన రిజర్వేషన్ల వారికి ఫీజు లేదు.
అర్హత : యానిమల్ హజ్బెండ్రీ , వెటర్నరీ సైన్స్ , బాటనీ కెమిస్ట్రీ, జియాలజీ, మాథ్స్ ,ఫిజిక్స్, జువాలజీ, సబ్జెక్ట్ లతో బ్యాచల్ డిగ్రీ అర్హత కలిగి ఉండాలి.
నోటిఫికేషన్ కోసం మరిన్ని వివరాలకోసం : https://www.upsc.gov.in/sites/default/files/Notification-IFoSE_2020_N_Engl.pdf
ఆన్లైన్ లో దరఖస్తు కోసం : https://upsconline.nic.in/mainmenu2.php