అమెరికాలో వంటి అగ్రరాజ్యంలో ఉద్యోగం వ‌స్తే ఎలా ఉంటుంది. ఆ ఆనంద‌మే వేరు అనుకుంటారు. అయినా ఆ ఛాన్స్ మాకెక్క‌డ వ‌స్తుందిలే.. అనుకునే వారూ ఉన్నారు. కానీ ముఖ్యంగా అమెరికాలో ఒక్క చిన్న ఉద్యోగం వస్తే చాలు లైఫ్ సెటిల్ అవుతుందనుకునే భారతీయులు ఎక్కువ మంది ఉంటారు. ఇందుకోసం వారు చేయని ప్రయత్నం అంటూ ఉండదు. ఇలా ముందుగా అమెరికా గడ్డపై కాలుపెట్టి.. ఏ హోటల్‌లోనో పెట్రోల్ బంకుల్లోనో పనిచేసుకుంటూ ఆ తర్వాత చిన్న టెక్ కంపెనీల్లో ఉద్యోగం సంపాదిస్తుంటారు చాలా మంది. ఇక ఇదంతా ప‌క్క‌న పెడితే.. ఆమెరికానే మిమ్మ‌ల‌ను ఉద్యోగం కోసం స్వ‌యంగా ఆహ్వానించింది.

 

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..  అమెరికా... టెక్సాస్‌లోని కొన్ని స్కూళ్లలో టీచర్ల కొరత వచ్చింది. ఎవర్నో ఎందుకు తెలుగు వాళ్లనే నియమిద్దామని అనుకున్నారు. కాబట్టి... అక్కడ ఉద్యోగం చెయ్యాలనుకునేవారు అప్లికేషన్ పెట్టుకోమని ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (APNRT) కోరుతోంది. మొత్తం 50 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అక్లెమ్‌ గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ ఇండియా అధ్వర్యంలో టెక్సాస్‌లోని స్కూళ్లలో టీచింగ్ పాఠాలు చెప్పాల్సి ఉంటుంది. ఏ సబ్జెక్టులు బోధించాలంటే... ఇంగ్లీష్, లేదా స్పెషల్ ఎడ్యుకేషన్ చెప్పేందుకు ఆసక్తి, అర్హత ఉన్న ఉపాధ్యాయులు అప్లై చేసుకోవచ్చు. 

 

అర్హతలు ఏంటంటే.. B.ed లేదా M.ed కలిగి... టీచింగ్‌లో ఐదేళ్ల అనుభవం ఉంటే చాలు. స్పెషల్ ఎడ్యుకేటర్‌గా గుర్తింపు ఉన్న ఉపాధ్యాయుల్ని తీసుకునే అవకాశాలు మరింత ఎక్కువగా ఉంటాయి. ఇక ఎవరైనా సరే వీసా పొందాలంటే... టోఫెల్ ఎగ్జామ్ రాయాలి. అందులో పాస్ అవ్వాలి. ఈ ఉద్యోగాల నియామకానికి ఏ ఫీజులూ తీసుకోవట్లేదు.  ఆసక్తి ఉంటే... ఆలస్యం చెయ్యకుండా... మార్చి 5 లోపు... https://dev.apnrts.ap.gov.in/home/teacherjobs లోకి వెళ్లి... అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇన్ని చెప్పిన వాళ్లు.. శాలరీలు ఇతర విషయాలేవీ చెప్పలేదేంటని అనుకోవచ్చు. వాటి వివరాలు అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత చెబుతారు.

మరింత సమాచారం తెలుసుకోండి: