ఇటీవ‌ల కాలంలో ఉన్న‌త చ‌దువును అభ్య‌సించి కూడా ఉద్యోగాలు దొర‌క‌క స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. అలాంటి వారింద‌రికి గుడ్ న్యూస్‌. తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ కాలేజీల్లో జూనియర్ లెక్చరర్ల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.  ఇంగ్లీష్, ఉర్దూ, తెలుగు, మ్యాథ్స్ లాంటి సబ్జెక్ట్స్‌లో జూనియర్ లెక్చరర్లను నియమిస్తున్నారు. అలాగే 2020-21 విద్యాసంవత్సరంలో 71 స్కూళ్లను కాలేజీలుగా అప్‌గ్రేడ్ చేస్తోంది తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ.

 

 ఆ కాలేజీల్లో ఇంటర్మీడియట్ ప్రారంభం కాబోతోంది. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ కోర్సుల్ని అందించబోతోంది. అందుకే ప్రతీ కాలేజీలో కనీసం 15 మంది జూనియర్ లెక్చరర్లను ఔట్‌సోర్సింగ్ పద్ధతిలో నియమిస్తోంది టీఎంఆర్ఈఐఎస్. ఇక మొత్తం పోస్టుల సంఖ్య 1,000. అంతే 71 కాలేజీల్లో ప్రతీ కళాశాలకు కనీసం 15 చొప్పున పోస్టులు ఉంటాయ‌ని తెలుస్తోంది. మరిన్ని వివరాల కోసం తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ అధికారిక వెబ్‌సైట్ http://tmreis.telangana.gov.in/ చూడొచ్చు. దరఖాస్తు ప్రక్రియ 2020 మార్చి 1న ప్రారంభమైంది. దరఖాస్తుకు మార్చి 31 చివరి తేదీ. 

 

మొత్తం జూనియర్ లెక్చరర్ ఖాళీలు 1,000 పైనే ఉన్నాయి. ఇంగ్లీష్, ఉర్దూ, తెలుగు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, కామర్స్, ఎకనమిక్స్, సివిక్స్ సబ్జెక్ట్స్ భోదించాలి. అలాగే ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్ 50 శాతం మార్కులతో పాస్ కావాలి. మ‌రియు బీఈడీ లేదా తత్సమాన డిగ్రీ విద్యార్హత ఉండాలి. ఇక ఏదైనా జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్టియర్, సెకండియర్‌లో కనీసం మూడేళ్లు బోధించిన అనుభవం ఉండాలి.  18 నుంచి 44 ఏళ్లు వయస్సు ఉండాలి. రాతపరీక్ష, ఇంటర్వ్యూ  ఎంపిక విధానం జ‌రుగుతుంది. రూ.27,000 వేతనం అందిస్తారు. ఇలాంటి మంచి ఎప్పుడు వ‌స్తుందో ఏమో.. కాబ‌ట్టి వెంట‌నే ద‌ర‌కాస్తు ప్రారంభించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: