ప్ర‌స్తుత కాలంలో యువ‌త ఉద్యోగాలు లేక రోడ్డున ప‌డుతున్న సంగ‌తి తెలిసిందే. ఉన్న‌త చ‌దువులు అభ్య‌సించి కూడా ఇలాంటి ప‌రిస్థితులు ఎదుర్కొంటున్నారు. అయితే స‌రైన ఉద్యోగం దొర‌క‌క కొంద‌రైతే.. అస‌లు నోటిఫికేష‌న్స్ ప‌డుతున్నాయ‌ని తెలియ‌క కొంద‌రు మంచి మంచి ఉద్యోగాల‌ను మిస్ చేసుకుంటుంటారు. ఇక ఇదంతా ప‌క్క‌న పెడితే.. నిరుద్యోగుల‌కు ఓ శుభ‌వార్త అని చెప్పాలి. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్-DRDO ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ జారీ చేసింది. 

 

కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్, ఫిట్టర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 116 అప్రెంటీస్ పోస్టుల్ని ప్రకటించింది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 మార్చి 23 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://rac.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. డిప్లొమా, గ్రాడ్యుయేషన్ ఉన్నవాళ్లు దరఖాస్తు చేయకూడదు. 

 

ఖాళీల వివరాలు చూస్తే.. మొత్తం 116 పోస్టులు ఉన్నాయి. అందులో కార్పెంటర్ 2, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ 23, డ్రాఫ్ట్స్‌మ్యాన్ (మెకానికల్) 5, ఎలక్ట్రీషియన్ 20, ఎలక్ట్రానిక్స్ 2, ఫిట్టర్ 33, మెషినిస్ట్ 11, మెకానిక్ (మోటార్ వెహికిల్) 5, పెయింటర్ 2, ప్లంబర్ 2, టర్నర్ 5, వెల్డర్ 6 పోస్టులు ఉన్నాయి. ఇక ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం 2020 మార్చి 2 కాగా, దరఖాస్తుకు చివరి తేదీ 2020 మార్చి 23. మ‌రియు 18 నుంచి 27 ఏళ్ల వ‌య‌స్సు ఉండాలి. దరఖాస్తుల షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక విధానం ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: