భారత ప్రభుత్వ రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖకు చెందిన చెన్నై ప్రధాన కేంద్రంగా ఉన్న సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ.. దీన్నే సింపుల్ గా సిపెట్ అంటారు. దీనికి దేశవ్యాప్తంగా యూనిట్లు ఉన్నాయి. వాటిలో కాంట్రాక్ట్ బేసిస్ లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి.

 

 

దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలైంది. మొతం ఖాళీలు: 241 పోస్టులు .. ఇందులో లెక్చరర్, ఫ్యాకల్టీ, ల్యాబొరేటరీ ఇన్‌స్ట్రక్టర్, టెక్నికల్ అసిస్టెంట్, ఏపీఓ తదితర ఉద్యోగాలు ఉన్నాయి.

 

 

ఈ పోస్టులకు ఆయా పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, బీఈ/ బీటెక్, ఎంబీఏ, ఎంఎస్సీ ఉత్తీర్ణత, అనుభవం అవసరం. రాతపరీక్ష, స్కిల్/ ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగ నియామకాలు ఉంటాయి.

 

 

ఆన్‌లైన్‌ ద్వారా ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సిఉంటుంది. ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. చివరి తేదీ మార్చి 20, 2020. మరిన్ని వివరాల కోసం

https://www..cipet.gov.in/ అనే వెబ్ సైట్ ను చూడవచ్చు.

 

 

ఈ సమాచారం మీకు ఉపయోగపడవచ్చు. పడకపోవచ్చు. కానీ దీన్ని మీ వాట్సప్ గ్రూపుల్లోనూ, ఫేస్ బుక్ లోనూ పోస్టు చేయండి. అవసరమైన వారికి ఇది ఉపయోగపడుతుంది. మనం అనవసరంగా ఎన్నో పోస్టులు ఫార్వార్డ్ చేస్తుంటాం. ఇలా పనికొచ్చే ఉద్యోగ సమాచారం పంపితే ఎవరికైనా ఉపయోగపడొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: