దేశ భాషలందు తెలుగు లెస్స...! తేట తెలుగు తేనె లొలుకు అంటారు. ఎంతో మంది గొప్ప గొప్ప కవులు మన భాషలోని కమ్మదనం గురించి ఎంతో గొప్పగా మనకి వివరించి విడమరచి మరీ చెప్పారు. కానీ మన తెలుగు దేశం లోనే ఆంగ్లమాధ్యమ చదువుల పిచ్చిలో పడి అమ్మలాంటి మనభాషకు అంతా దూరమై పోతున్నాం. తల్లిదండ్రులు కూడా ఈ పోటీ ప్రపంచంలో ఆంగ్ల మీడియం లోనే పిల్లల్ని చదివిస్తూ అసలు ఏదో ఒక నామమాత్రపు సబ్జెక్టుగా తెలుగు ను ట్రీట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న కాలగమనంలో అది తప్పనిసరి పరిస్థితి అయినా కూడా తెలుగు ఇంకా ఎక్కువ గుర్తింపు కి అర్హం అన్నది మాత్రం స్పష్టం.

 

ప్రస్తుతం రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ పాఠశాలలు అన్నింటిని ఇంగ్లీష్ మీడియం పాఠశాలగానే మార్చేస్తామని చెబుతూ ఉండగా మన తెలుగు రాష్ట్రాలకు దూరంగా ఉత్తర భారతదేశంలో హిమాలయాల దగ్గర రాష్ట్రంలో వందలకొద్దీ పాఠశాలల్లో తెలుగు భాషను బోధిస్తున్న తీరు ఇప్పుడు మొత్తం దేశాన్ని మొత్తం విస్మయానికి గురిచేసింది. మనం వదిలేస్తున్న భాషను వారు అక్కడ అక్కున చేర్చుకుంటున్నారు. హర్యానా లోని ప్రతి జిల్లాలో ప్రతి ప్రభుత్వ స్కూళ్లలో తెలుగుని బోధిస్తూ ఉండటం విశేషం.

 

ఇదంతా తెలంగాణ టూరిజం మన జాతి సంస్కృతిని దేశమంతటా పరిచయం చేయాలనే తపనతో ఈ నిర్ణయం తీసుకున్న కారణంగానే. తెలుగు భాష సంస్కృతి మరియు ప్రదేశాల గురించి అందరికీ అవగాహన కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం మరియు హర్యానా ప్రభుత్వం మధ్య ఒక ఒప్పందం కుదిరింది. ఇందుకోసం తెలంగాణ టీచర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రతి రోజు హర్యానా టీచర్లకు మరియు విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు హర్యానా లోని పలు స్కూళ్లలో బోధిస్తున్నారు.

 

అంతే కాకుండా ఈ సంవత్సరం జూన్ చివరి వరకూ తెలుగు బోధించి తర్వాత పరీక్ష పెట్టి పాస్ అయిన వారికి తెలంగాణ రాష్ట్ర సందర్శనకు కూడా తీసుకు వెళ్తారు. దీంతో విద్యార్థులు తెలుగు నేర్చుకునేందుకు అమితాసక్తి చూపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: