బ్యాంకు ఉద్యోగం మీ కలా? అయితే మీకో గుడ్ న్యూస్‌. బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాళీలను భర్తీ చేస్తోంది. మొత్తం 39 ఖాళీలను బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రకటించింది. ఇందులో టెక్నాలజీ ఆర్కిటెక్ట్, బిజినెస్ అనలిస్ట్, డేటా అనలిస్ట్ లాంటి పోస్టులున్నాయి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.bankofbaroda.in/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు. ఇదే వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. 2020 మార్చి 7 ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభంకాగా, దరఖాస్తుకు 2020 మార్చి 27 చివరి తేదీ. 

 

పోస్టుల వివ‌రాలు చూస్తే.. మొత్తం 39 ఖాళీలు ఉన్నాయి. అందులో టెక్నాలజీ ఆర్కిటెక్ట్ 1, ప్రోగ్రామ్ మేనేజర్ 1, క్వాలిటీ అస్యూరెన్స్ లీడ్ 2, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీడ్ 1, డేటాబేస్ ఆర్కిటెక్ట్ 1, బిజినెస్ అనలిస్ట్ లీడ్ 2, బిజినెస్ అనలిస్ట్ 5, వెబ్ అండ్ ఫ్రంట్ ఎండ్ డెవలపర్ 6, డేటా అనలిస్ట్ 4, డేటా ఇంజనీర్ 4, ఇంటిగ్రేషన్ ఎక్స్‌పర్ట్ 2, ఎమర్జింగ్ టెక్నాలజీ ఎక్స్‌పర్ట్ 3, మొబైల్ అప్లికేషన్ డెవలపర్ 5, UI/UX డిజైనర్ 2 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.

 

విద్యార్హతలు: వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ.100.
ఎంపిక విధానం: దరఖాస్తుల షార్ట్‌లిస్టింగ్, క్వాలిఫయింగ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్.

 

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 2020 మార్చి 7
దరఖాస్తుకు చివరి తేదీ: 2020 మార్చి 27.

మరింత సమాచారం తెలుసుకోండి: