రైల్వేలో ఉద్యోగం మీ క‌ళా..? అయితే ఇటీవ‌ల కాలంలో రైల్వేలో ఉద్యోగం కోరుకునేవారికి అనేక అవకాశాలు లభిస్తున్నాయి. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డుతో పాటు రైల్వే జోన్లు వేర్వేరుగా నోటిఫికేషన్లు జారీ చేస్తున్నాయి. ఇక ఇటీవ‌ల‌ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది వెస్ట్ సెంట్రల్ రైల్వే.  ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, సెక్రెటేరియల్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్-COPA లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఇప్ప‌టికే ద‌ర‌కాస్తు ప్ర‌క్రియ ప్రారంభ‌మైంది.

 

ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. www.mponline.gov.in వెబ్‌సైట్‌లో కూడా దరఖాస్తు చేయొచ్చు. దరఖాస్తుకు మార్చి 15 చివరి తేదీ. అంటే రేపు ఒక్క రోజు మాత్ర‌మే గ‌డువు మిగిలి ఉంది. కాబ‌ట్టి వెంట‌నే ఈ రైల్వే ఉద్యోగాల‌కు అప్లై చేయండి. ఈ ఉద్యోగాలకు 10వ తరగతిలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. 

 

ఇక  ఖాళీల వివరాలు ప‌రిశీలిస్తే.. 
ఫిట్టర్- 116
వెల్డర్ (గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్)- 34
ఎలక్ట్రీషియన్- 138
స్టెనోగ్రాఫర్ ఇంగ్లీష్- 3
ఎలక్ట్రానిక్ మెకానిక్- 15

 

కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్(COPA)- 52
సెక్రెటేరియల్ అసిస్టెంట్- 4పెయింటర్- 23
కార్పెంటర్- 28
ఏసీ మెకానిక్- 10
డీజిల్ మెకానిక్- 30

 

మేసన్- 26
బ్లాక్‌స్మిత్- 16
మెషినిస్ట్- 10
స్టెనోగ్రాఫర్ హిందీ- 3
కేబుల్ జాయింటర్- 2

 

సర్వేయర్- 8
డ్రాఫ్ట్స్‌మన్ సివిల్- 10
ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్- 12
సెక్రెటేరియల్ అసిస్టెంట్ ఇంగ్లీష్- 4

 

విద్యార్హత- 10వ తరగతి పాస్ కావడంతో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ ఉండాలి.
వయస్సు- 15 నుంచి 24 ఏళ్లు
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 ఫిబ్రవరి 15
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 మార్చి 15

మరింత సమాచారం తెలుసుకోండి: