ఏళ్ల తరబడి కష్టపడి ఉన్న‌త చ‌దువులు చ‌ద‌వి కూడా.. ఉద్యోగాలు దొర‌క‌కా.. కుటుంబాన్ని పోషించ‌లేక రోడ్డున ప‌డుతున్న‌వారు ఎంద‌రో. ప్రతి యేట ఎంతో మంది విద్యార్దులు డిగ్రీ, బీ-టెక్, ఎం‌బి‌ఏ పూర్తి చేసి ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు. ఇక చేతిలో డిగ్రీ పట్టాలు ఉన్నా కనీసం ప్రైవేట్‌ ఉద్యోగం కూడా దొరకని పరిస్థితి. అయితే అలాంటి వారంద‌రికీ ఓ గుడ్ న్యూస్‌. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ జారీ చేసింది. 

 

మొత్తం 85 ఖాళీలను ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో పలు పోస్టుల్ని భర్తీ చేస్తోంది. చీఫ్ డిజైన్ ఇంజనీర్, డిప్యూటీ సూపరింటెండెంట్, అసిస్టెంట్ ఇంజనీర్, అసిస్టెంట్ వెటర్నరీ ఆఫీసర్, డిప్యూటీ డైరెక్టర్ లాంటి పోస్టులున్నాయి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను యూపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ https://upsc.gov.in/ ఓపెన్ చేసి చూడొచ్చు.  అస‌క్తిక‌ర అభ్య‌ర్థులు  https://upsconline.nic.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 ఏప్రిల్ 2 చివరి తేదీ. 

 

పోస్టుల వివ‌రాల విష‌యానికి వ‌స్తే.. 
మొత్తం ఖాళీలు- 85
చీఫ్ డిజైన్ ఆఫీసర్- 1
అసిస్టెంట్ వెటర్నరీ ఆఫీసర్- 1అసిస్టెంట్ డైరెక్టర్- 13

 

అసిస్టెంట్ ఎంప్లాయ్‌మెంట్ ఆఫీసర్- 2
డిప్యూటీ సూపరింటెండెంట్- 2
డిప్యూటీ డైరెక్టర్- 3
అసిస్టెంట్ ఇంజనీర్- 63

 

విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. వివరాలు నోటిఫికేషన్‌లో చూడొచ్చు.
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఏప్రిల్ 2

మరింత సమాచారం తెలుసుకోండి: