వేలు, ల‌క్ష‌లు ఖ‌ర్చు పెట్టి ఉన్న‌ద చ‌దువులు చ‌దువుతున్నారు. అయినా ఉద్యోగాలు లేక యువ‌త దిక్కుతోచ‌ని స్ధితిలో క‌నిపిస్తున్నారు. మంచి ఉద్యోగం వ‌స్తుంద‌న్న ఆశ‌తో ఉన్న‌దంతా చ‌దువుల‌కే పెడుతుంటే.. ఆ త‌ర్వాత క‌నీస ఉద్యోగం దొర‌క‌క చాలా కుటుంబాలు రోడ్డున ప‌డుతున్నాయి. అయితే ఇలాంటి వారంద‌రికి ఓ గుడ్ న్యూస్‌. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-NPCIL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. 
మొత్తం 200 ఖాళీలను ప్రకటించింది. ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. గేట్ 2018, 2019, 2020 స్కోర్ ఆధారంగా భర్తీ చేస్తున్న పోస్టులివి. 

 

దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం అయింది.  ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.npcil.nic.in/ లేదా https://npcilcareers.co.in/ వెబ్‌సైట్స్‌లో చూడొచ్చు. ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థులు వెంట‌నే ద‌ర‌ఖాస్తు ప్రారంభించండి. ఇక దరఖాస్తుకు ఏప్రిల్ 2 చివరి తేదీ. అలాగే విద్యార్హత విష‌యానికి వ‌స్తే. సంబంధిత బ్రాంచ్‌లో బీఈ, బీటెక్, బీఎస్సీ ఇంజనీరింగ్, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ 60% మార్కులతో పాస్ కావాలి. గేట్ 2018, 2019, 2020 స్కోర్ ఉండాలి.

 

పోస్టుల వివరాలు ప‌రిశీలిస్తే.. 
మొత్తం ఖాళీలు- 200
మెకానికల్- 85
కెమికల్- 20
సివిల్- 35
ఇన్‌స్ట్రుమెంటేషన్- 7
ఇండస్ట్రియల్ & ఫైర్ సేఫ్టీ- 5
ఎలక్ట్రానిక్స్- 8ఎలక్ట్రికల్- 40

 

వయస్సు- 26 ఏళ్లు ఉండాలి.
దరఖాస్తు ఫీజు- జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు లేదు.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 మార్చి 24 ఉదయం 10 గంటలు
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 ఏప్రిల్ 2 సాయంత్రం 5 గంటలు

మరింత సమాచారం తెలుసుకోండి: