ప్ర‌స్తుతం క‌రోనా మ‌హ‌మ్మారి టైమ్ న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌పంచ‌దేశాల‌ను నానా ఇబ్బందులు పెడుతున్న క‌రోనా వైర‌స్ దెబ్బకు ప్ర‌జ‌లు అబ్బా అంటున్నారు. ఈ ర‌క్క‌సిని వ్యాక్సిన్ లేక‌పోవ‌డంతో.. నివార‌ణ‌పైనే అంద‌రూ దృష్టి పెడుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే క‌రోనా క‌ట్ట‌డికి ఎక్క‌డిక‌క్క‌డ లాక్‌డౌన్ విధించారు. అయితే ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్ అందించింది హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్. హెవీ ఇంజనీరింగ్ కార్పొరేషన్ లిమిటెడ్-HECL ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. 

 

ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 మార్చి 31 చివరి తేదీ. అయితే క‌రోనా కార‌ణంగా దరఖాస్తు గడువును 2020 ఏప్రిల్ 25 వరకు పొడిగించింది. ఇక జార్ఖండ్ రాజధాని రాంచీలో గల హెచ్ఈసీఎల్ గ్రాడ్యుయేట్ ట్రైనీ, డిప్లొమా ట్రైనీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ లాంటి విభాగాల్లో మొత్తం 169 ఖాళీలున్నాయి. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను http://hecltd.com/ వెబ్‌సైట్‌లో త‌నీఖీ చేయ‌వ‌చ్చు.

 

ఇక గ్రాడ్యుయేట్ ట్రైనీ పోస్టులు 116 కాగా వాటిలో సివిల్ ఇంజనీరింగ్- 6, కంప్యూటర్ సైన్స్ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ- 12, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్- 10, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్- 6, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్- 6, మెకానికల్ / ప్రొడక్షన్ ఇంజనీరింగ్- 355, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్- 3, మెటల్లార్జికల్ ఇంజనీరింగ్- 10, సెక్రెటేరియల్ ప్రాక్టీస్ అండ్ అకౌంట్స్ / ఆఫీస్ మేనేజ్‌మెంట్ అండ్ సెక్రెటేరియల్ ప్రాక్టీస్- 8 పోస్టులున్నాయి. అలాగే గ్రాడ్యుయేట్ ట్రైనీ పోస్టుకు సంబంధిత బ్రాంచ్‌లో డిగ్రీ. టెక్నీషియన్ ట్రైనీ పోస్టుకు సంబంధిత బ్రాంచ్‌లో డిప్లొమా విద్యార్హ‌త ఉండాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: