ఉద్యోగాలు లేక స‌మ‌మ‌త‌మ‌వుతున్న యువ‌త ఎంద‌రో ఉన్నారు. మంచి ఉద్యోగం వ‌స్తుంద‌ని ఉన్న‌దంతా చ‌దువుల‌కే పెట్టి.. ఆ త‌ర్వాత క‌నీస ఉద్యోగం లేక రోడ్డున ప‌డుతున్న‌వారు ఉన్నారు. అయితే ఇలాంటి వారంద‌రికీ ఓ గుడ్ న్యూస్ అందించింది తెలంగాణలోని సిమెంట్ కార్పొరేషన్. తెలంగాణలోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. మొత్తం 10 ఖాళీలున్నాయి. 

 

తెలంగాణలోని తాండూర్, హిమాచల్ ప్రదేశ్‌లోని రాజన్, అస్సాంలోని బోకాజన్‌లోని యూనిట్లలో మేనేజర్, అకౌంట్స్ ఆఫీసర్, ఇంజనీర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను https://www.cciltd.in/ వెబ్‌సైట్‌లో కెరీర్స్ సెక్షన్‌లో చూడొచ్చు. ఇక ఇదే వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫామ్ ప్రింట్ తీసుకొని పూర్తి చేసి, అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీ లోగా పంపించాల్సి ఉంటుంది.

 

దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు 2020 ఏప్రిల్ 7 చివరి తేదీ. అంటే మ‌రో రెండు రోజులే గ‌డువు మిగిలిపోయింది. పోస్టుల వివ‌రాలు ప‌రిశీలిస్తే.. మొత్తం ఖాళీలు 10 ఉన్నాయి. అందులో మేనేజర్ 6, అకౌంట్స్ ఆఫీసర్ 2, ఇంజనీర్ 1, ఆఫీసర్ 1 పోస్టులు ఉన్నాయి. సంబంధిత విభాగంలో ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి.

 

దరఖాస్తులు పంపాల్సిన అడ్రస్:
Manager HR,
Cement Corporation of india Limited,
Post Box No 3061,
Lodhi Road Post office,
New Delhi- 110003.
   

మరింత సమాచారం తెలుసుకోండి: