బోదిధర్మ అసలు పేరు ధర్మ వర్మ. ఆయన ఐదో శతాబ్దంలో తమిళనాడులోని కంచిపురం పాలిస్తున్న రాజు స్కందవర్మ మూడో కుమారుడి సంతానం. నాటి పల్లవ సామ్రాజ్యానికి మూడో తెలుగు చక్రవర్తిగా కొన‌సాగిన‌ట్లు చ‌రిత్ర‌కారుల పోరిశోధ‌న‌లు వెల్ల‌డిస్తున్నాయి.  కంచిపురంలో జన్మించడం వల్ల ఆయన తమ రాష్ట్రం వారనేనని తమిళులు ఘంటాప‌థంగా పేర్కొంటున్నారు. క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో బోధి ధ‌ర్ముడి గురించి..ఆయ‌న బోధ‌న‌ల గురించి నెటిజ‌న్లు విప‌రీతంగా సెర్చ్ చేస్తున్నార‌ట‌. కరోనా వైరస్ పీడిస్తున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆయన గురించి తెలుసుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉండ‌గా బోదిధర్మ మన తెలుగువారే అనే వాదన కూడా ఉంది. అయితే దీనికి సంబంధించిన కొన్ని ఆధారాలు కొంత‌మంది చూపుతున్నారు.


 చైనాలో 1వ శ‌తాబ్ధం నుంచే బౌద్ధ మతం వ్యాపించి ఉంది. అయితే, అక్కడి ప్రజలు పూర్తిగా బౌద్ధ ధర్మాలను పాటించకుండా బుద్ధి హీనులుగా మారడాన్ని గురువు ప్రజ్ఞతారను కలిచివేసింది. అక్కడ బౌద్ధ ధర్మాన్ని రక్షించేందుకు రెండో బుద్ధుడిగా వెళ్లాలని బోదిధర్మను ఆదేశిస్తారు. గురువు ఆజ్ఞానుసారం  బోధి ధ‌ర్ముడు భార్యా పిల్ల‌ల‌ను వ‌దిలి చైనా దేశం వెళ్తాడు. గురువుకు ఇచ్చిన మాట ప్రకారం.. చైనాలో బౌద్ధ ధర్మాన్ని వ్యాప్తిచేసిన బోదిధర్మ ఇండియాకు తిరిగి వెళ్లాలని నిర్ణయించు కుంటాడు. అయితే ఇదే విష‌యాన్ని  తన శిష్యులకు తెలిపి.. షేన్ గ్యాంగ్‌ను ఇక గురువుగా స్వీకరించాలని ఆదేశించారు.

 

 అయితే, బోదిధర్మ తమని విడిచి వెళ్లకూడదనే ఉద్దేశంతో ఓ శిష్యుడు ఆహారంలో విషం కలిపి బోదిధర్మను చంపేశాడని ఇప్ప‌టికైతే ఒక విష‌యం ప్ర‌చారంలో ఉంది.  అలాగే బోదిధర్మ భౌతిక కాయాన్ని ఓ పర్వతం ప్రాంతంలో సమాధి చేశారని చైనాలో చెప్పుకుంటారు. అయితే, అది అసత్యమని బోధిధర్మ 170 ఏళ్ల వయస్సులో 536లోనే చనిపోయారనే వాదన ఉంది. అయితే, ఆయన మరణంపై ఇన్ని శ‌తాబ్దాలైన మిస్టరీ వీడ‌లేదు. అయితే ఇండియాలో పుట్టి.. చైనా ప్రజల ఇష్ట దైవంగా మారిన ఆయన బౌద్ధ ధర్మం కోసం తన వ్యక్తిగత జీవితాన్నే త్యజించిన మ‌హనీయుడు బోధి ధ‌ర్ముడు.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: