దక్షిణ మధ్య రైల్వే తాత్కాలిక జాబ్స్ కోసం వాట్సాప్ఈ, మెయిల్ ద్వారా నిరుద్యోగ అభ్యర్థుల దరఖాస్తులను కోరుతుంది. దక్షిణ మధ్య రైల్వే లోని భాగమైన లాలాగూడ, సికింద్రాబాద్ కు చెందిన సెంట్రల్ ఆసుపత్రిలో మూడు నెలల పాటు తాత్కాలికంగా పనిచేసేందుకు... 9 మంది స్పెషలిస్ట్ డాక్టర్స్, 34 మంది GDMO డాక్టర్స్, నర్సింగ్ సూపరింటెండెంట్లు, ఏడుగురు ల్యాబ్‌ అసిస్టెంట్లు, 77 మంది హాస్పిటల్‌ అటెండెంట్ల కోసం దక్షిణ మధ్య రైల్వే అధికారిక వెబ్సైట్ తాజాగా నోటిఫికేషన్‌ జారీ చేసింది.


అర్హత కలిగిన అభ్యర్థులు www.scr.indianrailways.gov.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని రైల్వే అధికారులు వెల్లడించారు. ఆన్లైన్ లో అప్లై చేసుకునేందుకు ఈ నెల అనగా ఏప్రిల్ 15 వరకు సమయం ఉందని నోటిఫికేషన్ లో పేర్కొనబడింది. అయితే వీడియో కాల్ ద్వారా ఇంటర్వ్యూలు నిర్వహించి అర్హత గల అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది. ఎంపిక కాబడిన అభ్యర్థులు ప్రత్యేకంగా కోవిడ్ 19 వ్యాధిగ్రస్తులు ఉన్న ఐసోలేషన్ వార్డులలో విధులు నిర్వహించవలసి ఉంటుంది. మీరు ఈ జాబ్ నోటిఫికేషన్ కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే 9701370624 నెంబర్ కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు.


స్పెషలిస్ట్ డాక్టర్ల వేతనాలు నెలకు 90 వేల వరకు ఉంటుంది. GDMO వైద్యులకు నెలకి 75 వేల రూపాయలను ఇవ్వనున్నట్లు నోటిఫికేషన్లో తెలియజేయబడింది. నర్సింగ్ సూపరింటెండెంట్ల కు 44, 900 రూపాయల వేతనం... ల్యాబ్‌ అసిస్టెంట్లకు రూ. 21, 700... హాస్పిటల్‌ అటెండెంట్లకు రూ. 18, 000 జీతభత్యాలు లభించనున్నాయి. ఈ విపత్కర సమయంలో భారత ప్రభుత్వానికి సహాయం చేసేందుకు అర్హత గల అభ్యర్థులు తప్పకుండా జాబ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని రైల్వే అధికారులు చెబుతున్నారు. అర్హత గల అభ్యర్థులకు ఏప్రిల్ 18వ తేదీ నుండి వీడియో ఇంటర్వ్యూలు ప్రారంభమగును. ఏజ్ లిమిట్( వయోపరిమితి) 20 నుండి 54 సంవత్సరాల లోపు ఉండొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: