నేటి కాలంలో ఉన్న‌త చ‌దువులు అభ్య‌సించి కూడా చేతిలో ఉద్యోగంలేక నానా ఇబ్బందులు ప‌డుతున్న వారు ఎంద‌రో ఉన్నారు. మ‌రోవైపు  ఉద్యోగాలున్నా... సరైన నైపుణ్యాలున్నవారు దొరకడం లేదని కంపెనీలు అంటున్నాయి. ఇలాంటి టైమ్‌లో ఏదో ఒక ఉద్యోగం దొరికితే చాలనుకునేవారు  చాలా మందే ఉన్నారు. ఇక ప్ర‌స్తుతం క‌రోనా కార‌ణంగా ఉన్న ఉద్యోగాలు కూడా ఊడుతున్నాయి. దీంతో ఏటూ తోచ‌ని స్థితిలో ప్ర‌జ‌లు ఉన్నారు. అయితే విప‌త్క‌ర ప‌రిస్థితిలో డిగ్రీ, బీటెక్, పీజీ పాసైనవారికి గుడ్ న్యూస్ వ‌చ్చింది.

 

పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా-FSSAI ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 83 ఖాళీలు ఉన్నాయి. అసిస్టెంట్, పర్సనల్ సెక్రటరీ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. డిగ్రీ, బీటెక్, పీజీ లాంటి అర్హతలున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2020 ఏప్రిల్ 20 చివరి తేదీ. కాబ‌ట్టి వెంట‌నే దర‌ఖాస్తు ప్రారంభించండి.

 

ఇక మొత్తం 83 ఖాళీలుండగా వాటిలో అడ్వైజర్- 1, డైరెక్టర్- 7, జాయింట్ డైరెక్టర్- 2, డిప్యూటీ డైరెక్టర్- 2, అసిస్టెంట్ డైరెక్టర్- 10, అడ్మినిస్ట్రేటీవ్ ఆఫీసర్- 20, అసిస్టెంట్- 8, సీనియర్ ప్రైవేట్ సెక్రెటరీ- 4, పర్సనల్ సెక్రెటరీ- 15, సీనియర్ మేనేజర్- 2, మేనేజర్- 4, డిప్యూటీ మేనేజర్- 8 పోస్టులున్నాయి. అభ్యర్థుల వయస్సు గరిష్టంగా 56 ఏళ్లు. ఆసక్తి గల అభ్యర్థులు https://fssai.gov.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి అర్హతలు తెలుసుకోవాలి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: