ఉద్యోగం కోసం వెతికి వెతికి అల‌సిపోయారా..? ఉన్న‌త చ‌దువులు చ‌దివి కూడా ఉద్యోగం రాక బాధ‌ప‌డుతున్నారా..? అయితే మీకు ఇటీవ‌ల‌ గుడ్ న్యూస్ అందించింది హైదరాబాద్ వాటర్ బోర్డు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-TSPSC హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డ్-HMWSSB ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. మొత్తం 93 మేనేజర్ పోస్టుల భర్తీ చేస్తోంది. సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లాంటి బ్రాంచ్‌లో మేనేజర్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది.

 

వాస్తవానికి ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ 2020 మార్చి 30న ముగుస్తుందని నోటిఫికేషన్‌లో వెల్లడించింది. అయితే ప్ర‌స్తుతం క‌రోనా క‌ష్ట‌కాలం న‌డుస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం క‌రోనా దెబ్బ‌కు అన్ని వ్య‌వ‌స్థ‌లు అత‌లా కుత‌లం అయిపోతున్నాయి. ప్ర‌పంచ‌దేశాలు చిగురుటాకులు వ‌ణికిపోతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే  లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో దరఖాస్తు ప్రక్రియను ఏప్రిల్ 30 వరకు  టీఎస్‌పీఎస్‌సీ పొడిగించింది. 

 

ఇక ద‌ర‌ఖాస్తు పొడిగించ‌డంతో ఏప్రిల్ 30 వ‌ర‌కు ఆప్లై చేయ‌డానికి ఛాన్స్ ఉంది. కాబ‌ట్టి అప్పుడు మిస్ అయిన అభ్య‌ర్థులు ఈ ఛాన్స్‌ను మిస్ చేసుకోకండి.  టీఎస్‌పీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్ https://www.tspsc.gov.in/ ఓపెన్ చేసి దరఖాస్తు చేయాలి. అలాగే మొత్తం 93 ఖాళీలు ఉండగా మేనేజర్ (సివిల్ ఇంజనీరింగ్)- 79, మేనేజర్ (మెకానికల్ ఇంజనీరింగ్)- 06, మేనేజర్ (ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్)- 04, మేనేజర్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్)- 03, మేనేజర్ (కంప్యూటర్ సైన్స్/ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్)- 01 పోస్టులున్నాయి.

 

అలాగే  సంబంధిత బ్రాంచ్‌లో ఇంజనీరింగ్ డిగ్రీ పాసైనవారు అప్లై చేయొచ్చు. ఇక దరఖాస్తు ఫీజు రూ.200. హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్‌లో పరీక్షా కేంద్రాలను ప్రకటించింది. ఆస‌క్తిక‌ర అభ్య‌ర్థులు లేట్ చేయకుండా వెంట‌నే ద‌ర‌ఖాస్తు ప్రారంభించండి. మ‌రిన్ని వివ‌రాల కోసం https://www.tspsc.gov.in/ వెబ్‌సైట్‌లో చూడ‌వ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: