ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా ప్రజలంతా అల్లాడిపోతున్నారు.. ఎప్పుడు ఈ బాధ తగ్గుతుందా? అని ఎదురు చూస్తున్నారు. లాక్ డౌన్ అనంతరం పదో తరగతి పిల్లలకు పరీక్షలు పెడుదాం అనుకుంటే కరోనా తగ్గడం లేదు.. లాక్ ఎత్తి వెయ్యడం లేదు. ఇంకా ఈ నేపథ్యంలోనే ఆంధ్రలో పదో తరగతి పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 

 

ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ మీడియాతో మాట్లాడుతూ.. లాక్ డౌన్ పొడిగించిన నేపథ్యంలో 10వ తరగతి పరీక్షలు నిర్వహించలేకపోతున్నామని, పరీక్షలు నిర్వహించే వరుకు విద్యార్థులు సప్తగిరి ఛానల్ ద్వారా క్లాసులను వినాలని మంత్రి సూచించారు. విద్యార్థులు ఇంటి వద్దే ఉండి రోజుకు రెండు గంటలు పాటు క్లాసులు వినాలి అని ఆయన సూచించారు. 

 

పరీక్షలు ఏ విధంగా రాయాలి.. ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేవి అన్ని విద్యార్థులకు అర్థం అయ్యేలా సప్తగిరి ఛానల్ లో  ఉపాధ్యాయాలు చెప్తారు అని అయన పేర్కొన్నారు. ఇంకా ఈ క్లాసెస్ మిస్ అవుతే అవే క్లాసులను యూట్యూబ్ సప్తగిరి ఛానల్‌లోనూ చూడొచ్చని మంత్రి తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: