ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. అగ్ర రాజ్యం అమెరికాలో కరోనా భారీన పడి వేల సంఖ్యలో ప్రజలు మృతి చెందారు. కరోనా సంక్షోభం అమెరికాలోని భారతీయుల ఉద్యోగాలపై పడింది. ఇప్పటికే కోటి ఉద్యోగాలు పోయినట్టు వార్తలు వస్తుండగా మరో రెండు కోట్ల ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని సమాచారం. కరోనా సంక్షోభం ప్రభావం భారతీయ హెచ్ 1 బి ఉద్యోగులపై పడనుందని తెలుస్తోంది.

 

అమెరికాలో కరోనా సంక్షోభంతో భవిష్యత్తులో భారతీయ ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉండబోతుందనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. కరోనా వ్యాప్తితో అల్లాడిపోతున్న అమెరికా మన దేశ ఉద్యోగులకు భరోసా ఇచ్చే పరిస్థితి లేదని తెలుస్తోంది. భారతీయులు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని సమాచారం. కరోనా సంక్షోభం వల్ల ఇప్పటికే కొన్ని కంపెనీలు 1500 నుంచి 2000 ఉద్యోగాలకు కోత పెట్టాయని వార్తలు వస్తున్నాయి.

 

అమెరికాలో కరోనా సంక్షోభం వల్ల తాత్కాలికంగా కొన్ని కంపెనీలు మూతబడుతున్నాయని తెలుస్తోంది. అమెరికాలో రెస్టారెంట్లు, హోటళ్లు, ట్రావెల్ ఇండస్ట్రీలపై కరోనా ప్రభావం భారీగా పడింది. అయితే అమెరికా ప్రభుత్వం మాత్రం వ్యాపారాలు దెబ్బ తినకుండా కొన్ని రోజుల క్రితం 2.2 ట్రిలియన్ డాలర్లు ఇచ్చింది. ఐటీ ఉద్యోగుల్లో ఎక్కువ శాతం వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు కాబట్టి ప్రస్తుతానికి ఏ సమస్య లేదని పరిస్థితి ఇలాగే కొనసాగితే మాత్రం ఉద్యోగులపై తీవ్ర ప్రభావం పడనుందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: