ప్ర‌స్తుతం క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచ‌వ్యాప్తంగా అల్ల‌క‌ల్లోలం సృష్టిస్తున్న సంగ‌తి తెలిసిందే. చైనాలో పుట్టిన ఈ వైర‌స్ దేశ‌దేశాలు తానే రాజై పాలిస్తోంది. ఈ ర‌క్క‌సి ముందు ఎంతంటి ధ‌న‌వంతుడైనా.. బ‌ల‌వంతుడైనా నిల‌వ‌లేక‌పోతున్నారు. ఇక సామాన్యుల ప‌రిస్థితి చెప్పుకుంటే తీరేవిగా క‌నిపించ‌డం లేదు. మ‌రోవైపు వ్యాక్సిన్ లేని మ‌హ‌మ్మారిని మ‌ట్టుపెట్టేందుకు ప్ర‌పంచ‌దేశాలు చేయ‌ని ప్ర‌య‌త్నం లేదు. ఇప్ప‌టికే లాక్‌డౌన్ విధించ‌డంతో పాటు క‌ఠ‌న చ‌ర్య‌లు కూడా తీసుకుంటున్నారు. అయిన‌ప్ప‌టికీ అడ్డు అదుపు లేకుండా క‌రోనా విశ్వ‌రూపం చూపింస్తుంది.

 

ఇక ఈ క‌రోనా కార‌ణంగా ఎన్నో వ్య‌స్థ‌లు కుప్ప‌కూలాయి. దీంతో ఎంద‌రు ఉద్యోగులు కాస్తా.. నిరుద్యోగులుగా మారుతున్నాయి. అయితే ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో హైద‌ర‌బాద్ నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్ అందించింది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ హైదరాబాద్. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ హైదరాబాద్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది.  ఖాళీలు కేవలం 6 మాత్రమే ఉన్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే స్టాట్ అయింది. 

 

కానీ క‌రోనా కార‌ణంగా దరఖాస్తు గడువును 2020 మే 1 వరకు పొడిగించారు. విద్యార్హ‌త విష‌యానికి వ‌స్తే.. అగ్రికల్చర్‌ లేదా బాటనీ లేదా బయో టెక్నాలజీ లేదా మెరైన్ బయాలజీలో బ్యాచిలర్స్ డిగ్రీ పాసై ఉండాలి. మ‌రియు అభ్యర్థుల వయస్సు 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఇక ఆస‌క్తిగ‌ల‌ అభ్య‌ర్థులు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారెస్ట్ బయోడైవర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసి, ప్రింట్ తీసుకొని, ఫామ్ పూర్తి చేసి నోటిఫికేషన్‌లో వివరించిన అడ్రస్‌కు చివరి తేదీ లోగా పంపాలి. మ‌రిన్ని వివ‌రాల్ల‌కు http://ifb.icfre.gov.in/ వెబ్‌సైట్‌లో చూడ‌వ‌చ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: