కరోనా వైరస్ ప్రపంచాన్ని ఎలా వణికిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా ఈ వైరస్ వల్ల సాఫ్ట్ వెర్ సంస్దలు, కార్పొరేట్, ఇతర సంస్దల ఉద్యోగులకు కూడా వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చారు. అయితే ఈ వర్క్ ఫ్రం హోమ్ కారణంగా హ్యాకింగ్ సమస్య ఎక్కువ అయ్యింది. దీంతో సైబర్ సెక్యూరిటీ ఏజన్సీలు హెచ్చరిస్తున్నాయి. 

 

కరోనాను అడ్డు పెట్టుకొని సైబర్ క్రైములు ఎక్కవ అవుతున్నాయి అని.. వాటికీ అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం హోంశాఖ రాష్ట్రాలకు, ఉద్యోగులకు పలు కిలక సూచనలు జారీ చేసింది.. ఉద్యోగుల పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.  

 

ఆన్లైన్ ద్వారా పని చేసే ఉద్యోగులు అంత కూడా ఆన్‌లైన్ అకౌంట్స్‌కు డీఫాల్ట్ పాస్‌వర్డ్ బదులుగా స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌ను పెట్టుకోవాలి అని, డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌లను పటిష్టమైన యాంటీ వైరస్‌తోనూ, అప్లికేషన్స్‌ను నిరంతరం అప్‌డేట్ చెయ్యాలి అని సూచలను జారీ చేశారు. 

 

ఏ ఉద్యోగి తమ సంస్దలకు సంబంధించిన మీటింగ్‌‌, వర్క్‌కు సంబంధించిన లింక్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయకూడదు. 

 

వీడియో కాన్ఫరెన్సుల కోసం నమ్మకమైన వెబ్‌సైట్‌ను మాత్రమే వినియోగించాలి. ఏలాంటి కొత్త కొత్త వెబ్సైట్స్ ని ఉపోయోగించకూడదు. 

 

అంతే కాదు కేవలం ఇంటిలోని వైఫై నెట్‌వర్క్‌లని మాత్రమే ఉపయోగించుకోవాలి.. ఎటువంటి ఫ్రీ వైఫై, ఓపెన్ వైఫ్ ఉపయోగించకూడదు. అలాగే వారానికి ఒకసారి మన ఇంటి వైఫ్ పాస్వర్డ్ మారుస్తూ ఉండాలి. 

 

ఇంకా మెయిల్స్ కూడా ఏవి అంటే అవి తెరవకూడదు.. ఇంకా మెయిల్స్ నుండి వచ్చే లింక్స్ ని ఎట్టి పరిస్థితుల్లోను ఓపెన్ చెయ్యకుండా ఉండాలి. 

 

మనం వర్క్ ఫ్రం హోమ్ అయినప్పటికీ సొంత డెస్క్ టాప్, ల్యాప్ టాప్ లు ఉపయోగించడం మంచిది కాదు.. కాబట్టి కంపెనీ ఇచ్చిన డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌లను ఉపయోగించడం ఎంతో మంచిది. 

మరింత సమాచారం తెలుసుకోండి: