క‌రోనా వైర‌స్‌.. ఇప్పుడు ఎక్క‌డ చూసినా ఇదే టెన్ష‌న్ నెల‌కొంది. చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైర‌స్ ప్ర‌పంచ‌దేశాలు వ్యాప్తిచెంది.. అనేక మంది ప్ర‌జ‌ల ప్రాణాల‌ను బ‌లి తీసుకుంది.  ఇప్పటి వరకు పాజిటివ్ కేసులు 22లక్షలు దాటాయి. మ‌రియు 1.54లక్షలకు పైగా ప్రాణాలు విడిచారు. ముఖ్యంగా అమెరికా, స్పెయిన్, ఇటలీ, జర్మనీ దేశాల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉన్నప్పటికీ... 204 దేశాల్లో కరోనా తన ఉనికి చాటుకుంది.  ఇక పెద్ద‌న్న‌గా చెప్పుకునే  అగ్రరాజ్యం అమెరికా కూడా క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌లేక‌పోతుంది. అయితే ప్ర‌స్తుతం క‌రోనా రోజురోజుకు విస్త‌రిస్తుండ‌డంతో ప‌లు దేశాలు లాక్‌డౌన్ విధించాయి.

 

మ‌రియు ప్ర‌జ‌ల‌ను బ‌య‌ట‌కు రాకుండా క‌ఠ‌న చ‌ర్య‌లు చేప‌ట్టింది. ఇక లాక్‌డౌన్ కార‌ణంగా ఎన్నో సంస్థ‌లు మూత‌ప‌డ్డాయి. ఎంద‌రు ఉద్యోగులు.. నిరుద్యోగులుగా మారుతున్నారు. అయితే ఇలాంటి స‌మ‌యంలో ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్-ESIC హైదరాబాద్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. సూపర్ స్పెషాలిస్ట్, స్పెషలిస్ట్, సీనియర్ రెసిడెంట్స్ లాంటి పోస్టులున్నాయి. మొత్తం 35 ఖాళీలను భర్తీ చేస్తోంది. అవసరాలను బట్టి ఈ ఖాళీల సంఖ్య పెరగొచ్చు లేదా తగ్గొచ్చ‌ని తెలుస్తోంది. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ విడుద‌ల చేసిన నోటిఫికేష‌న్‌లో మొత్తం 35 ఖాళీలు ఉన్నాయి. 

 

అందులో సూపర్ స్పెషలిస్ట్ 10, స్పెషలిస్ట్ 1, సీనియర్ రెసిడెంట్ 24 పోస్టులు ఉన్నాయి.  ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2020 ఏప్రిల్ 26 చివరి తేదీ. అలాగే సనత్‌నగర్‌లోని ఈఎస్ఐసీ మెడికల్ కాలేజ్, మెడికల్ కాలేజ్ హాస్పిటల్, ఈఎస్ఐసీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో ఈ ఖాళీలను భర్తీ చేస్తారు. అభ్యర్థులకు ఏప్రిల్ 28 నుంచి మే 4 వరకు ఇంటర్వ్యూలు ఉంటాయి. అలాగే ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మ‌రిన్ని వివరాలను ఈఎస్ఐ కార్పొరేషన్ అధికారిక వెబ్‌సైట్ https://www.esic.nic.in/ లో త‌నిఖీ చేసుకోవ‌చ్చును. ఇక ఆస‌క్తిగ‌త అభ్య‌ర్థులు వెట‌నే దర‌ఖాస్తు ప్రారంభించండి.

మరింత సమాచారం తెలుసుకోండి: