నేటి కాలంలో డిగ్రీ ప‌ట్టా చేతులో ఉన్నా ఉద్యోగం దొర‌క‌ని ప‌రిస్థితి. ఆ ఆఫీస్ చుట్టూ.. ఈ ఆఫీస్ చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా ఉద్యోగం రాక ఎన్నో ఇబ్బందులు ప‌డుతున్నారు. మ‌రోవైపు ఉద్యోగం దొర‌క‌క కొంద‌రు ఆత్మ‌హ‌త్య‌లు కూడా చేసుకుంటున్నారు. అయితే ఇంట‌ర్ అర్హ‌త‌తోనే కేంద్రం ఉద్యోగాలు భ‌ర్తీ చేస్తోంది. మ‌రి ఇంట‌ర్ అర్హ‌త‌తో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఏమేమి ఉన్నాయి.. వాటి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.

 

ఎస్‌ఎస్‌సీ స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌ సీ, డీ:  స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ స్కిల్‌ టెస్టు ద్వారా ఈ పోస్టులను కేంద్రం భర్తీ చేస్తుంది. ఎంపిక విధానం రెండు దశలుగా ఉంటుంది. మొదటి దశలో రాత పరీక్ష, రెండో దశలో స్టెనోగ్రఫీలో స్కిల్‌ టెస్ట్‌ ఉంటుంది. రాత పరీక్షలో రీజనింగ్, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌, జనరల్‌ ఇంటెలిజెన్స్‌, జనరల్‌ అవేర్‌నెస్‌, కాంప్రహెన్షన్‌ సబ్జెక్టులు ఉంటాయి.అభ్యర్థులు ఇంటర్ పాస్ అవ్వాలి. మ‌రియు 18 నుంచి 27 ఏండ్లలోపు ఉండాలి. మ‌రిన్న వివ‌రాల కోసం వెబ్‌సైట్‌ www.ssc.nic.in లో చూడండి. వేత‌నం విష‌యానికి వ‌స్తే.. గ్రేడ్‌ సీకి రూ.9300-34,800 (గ్రేడ్‌ పే రూ.4200) వరకు, గ్రూప్‌ డీకి రూ.5200-20,200 (గ్రేడ్‌ పే రూ.2400) వరకు పొందొచ్చు.

 

ఇంటర్‌తో ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ: యూపీఎస్సీ నిర్వహించే ఎన్‌డీఏ అండ్‌ ఎన్‌ఏ (నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ అండ్‌ నేవల్‌ అకాడమీ) ఎగ్జామినేషన్‌ ఇంటర్‌ అర్హతతో త్రివిధ దళాల్లో అడుగుపెట్టే అవకాశం అందిస్తోంది. ఆర్మీ వింగ్‌ పోస్టులకు ఏదైనా గ్రూపుతో ఇంటర్‌ పూర్తిచేసిన పెండ్లికాని పురుష అభ్యర్థులు అర్హులు. మ‌రియు 16 నుంచి 19 ఏండ్లలోపు ఉండాలి. ఎంపిక ప్రక్రియ రెండంచెలుగా ఉంటుంది. రాతపరీక్షలో ప్రతిభ ఆధారంగా ఎస్‌ఎస్‌బీ ఇంటెలిజెన్స్‌, పర్సనాలిటీ టెస్టులను నిర్వహించి ఎంపిక చేస్తారు. ఎంపికయిన అభ్యర్థులకు శిక్షణ ఇస్తారు. శిక్షణ అనంతరం ఇండియన్‌ ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్‌, నేవీ విభాగాల్లో లెఫ్టినెంట్‌, సబ్‌ లెఫ్టినెంట్‌, ఫ్లయింగ్‌ ఆఫీసర్‌, సెయిలర్‌ ఉద్యోగాలు లభిస్తాయి. మ‌రిన్ని వివ‌రాల కోసం  https://upsc.gov.in వెబ్‌సైట్‌ను చూడ‌వ‌చ్చు.

 

ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌: దీనిలో ఎయిర్‌మెన్‌ గ్రూప్‌-ఎక్స్‌, వై ట్రేడ్స్‌ పోస్టులు ఉన్నాయి. రాతపరీక్ష, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక ఉంటుంది. మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, ఇంగ్లిష్‌ సబ్జెక్టులతో ఇంటర్‌ పాసై, 17 నుంచి 21 ఏండ్లలోపు ఉండాలి. ఎయిర్‌మెన్‌ గ్రూప్‌-వై మెడికల్‌ అసిస్టెంట్‌ ట్రేడ్స్‌ పోస్టులకు బైపీసీతో ఇంటర్‌ పాస్‌ కావాలి. మ‌రిన్ని వివ‌రాల కోసం http://airmenselection.cdac.in  వెబ్‌సైట్‌లో చూడ‌వ‌చ్చు.

 

ఇండియన్‌ పోస్టల్‌:  పోస్టల్‌ అసిస్టెంట్‌, సార్టింగ్‌ అసిస్టెంట్‌ పోస్టులు ఇందులో భర్తీ చేయ‌నున్నారు. ఈ ఉద్యోగాల కోసం ఇంటర్‌ పాసై, 18 నుంచి 27 ఏళ్లు ఉండాలి. వీటికి నిర్వహించే రాతపరీక్ష పేపర్‌-1, పేపర్‌-2గా ఉంటుంది. పేపర్‌-1లో జనరల్‌ నాలెడ్జ్‌, మ్యాథమెటిక్స్‌, మెంటల్‌ ఎబిలిటీ, రీజనింగ్‌, ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ల నుంచి ప్రశ్నలు వస్తాయి. పేపర్‌-2లో కంప్యూటర్‌/టైపింగ్‌ టెస్ట్‌ ఉంటుంది. మ‌రిన్ని వివ‌రాల కోసం www.indiapost.gov.in వెబ్‌సైట్‌లో చూసుకోవ‌చ్చు.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: