కరోనా వైరస్ దెబ్బ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. అన్ని రంగాలపై కరోనా వైరస్ దెబ్బ పడింది... ఇంకా విద్యాసంస్దలపైన అయితే మరి ఘోరంగా పడింది.. ఏప్రిల్ లో రావాల్సిన సెలవలు మర్చి నెలలోనే వచ్చాయి.. కరోనా హాలిడేస్ నుండి సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయ్యాయి.. 

 

9వ తరగతి పిల్లల వరుకు ఇది పెద్ద ఇబ్బంది అవ్వదు కానీ.. 10వ తరగతి పిల్లలకు ఇంకా పరీక్షలే అవ్వలేదు.. ఎం సెట్, నీట్ వంటి పరీక్షలు జారగానే లేదు.. అందుకే యూజీసీ నిపుణుల సమావేశం అయ్యారు.. యూనివర్సిటీలు, ఉన్నత విద్యా సంస్థలు వచ్చే విద్యా సంవత్సరాన్ని సెప్టెంబరులో ప్రారంభించాలని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్ నియమించిన నిపుణుల కమిటీ సిఫార్సు చేసింది. 

 

ప్రతి సంవతసరం జులై, ఆగస్టు నెలల్లో ప్రారంభమయ్యే అకడమిక్‌ కేలండర్‌ ఈసారి నెల రోజులు ఆలస్యం అవ్వనుంది అనేది తెలిపింది. అకడమిక్‌ కేలండర్‌, పరీక్షల నిర్వహణకు హరియాణా యూనివర్సిటీ వీసీ ఆర్‌సీ కుహడ్‌ అధ్యక్షతన, ఆన్‌లైన్ ‌విద్య మెరుగుకు సూచనలు ఇచ్చేందుకు కమిటీ వేశారు. 

 

అంతేకాదు ఆన్‌లైన్‌లో పరీక్షలు నిర్వహించేందుకు మౌలిక సదుపాయాలు ఉంటే నిర్వహించాలి అని లేదు అంటే లాక్‌డౌన్‌ తర్వాత పెన్ను, పేపర్‌ పరీక్షలను నిర్వహించాలి అని నిర్ణయించారు.. పరీక్షల నిర్వహణకు అవకాశం లేకపోతే పథ సెమిస్టరు లో విద్యార్థుల మార్కులను బట్టే పై తరగతులకు పంపించాలి అని నిర్ణయించారు.. ఈ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం పరీక్షల నిర్వహణ, అకడమిక్‌ కేలండర్‌పై కేంద్రం త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేయనుంది.                                                         

మరింత సమాచారం తెలుసుకోండి: