ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా విల‌య‌తాండ‌వం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క‌రోనా వైర‌స్ ధాటికి అటు ప్ర‌జ‌లు, ఇటు ప్ర‌భుత్వాలు తీవ్ర స్థాయిలో ఇబ్బందులు ప‌డుతున్నారు. ఈ మహమ్మారి కోరల్లో చిక్కుకుని అన్ని దేశాలూ విలవిలలాడుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో వైరస్ విజృంభణ ఆగడం లేదు. ఇక ప్ర‌స్తుతం ప్రపంచవ్యాప్తంగా మొత్తం 32 లక్షల మంది వైరస్ బారినపడగా.. వీరిలో 2.28 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మ‌రోవైపు క‌రోనాను క‌ట్ట‌డి చేసేందుకు ప‌లు దేశాలు లాక్‌డౌన్ విధించాయి.

 

ఈ క్ర‌మంలోనే ఎన్నో కంపెనీలు మూత‌ప‌డ్డాయి. దీంతో చాలా మంది ఉద్యోగాలు పోగొట్టుకుని రోడ్డున ప‌డుతున్నారు. అయితే ఇలాంటి స‌మ‌యంలో బీటెక్ పాసైన‌వారికి శుభ‌వార్త చెబుతూ.. నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్-NALCO ఉద్యోగాల భర్తీ చేస్తోంది. ఈ నోటిఫికేష‌న్‌లో మొత్తం 120 గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ పోస్టులు ఉన్నాయి. ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీలో ఫుల్ టైమ్ బ్యాచిలర్స్ డిగ్రీ పాసైనవాళ్లు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవ‌చ్చు. గేట్ 2020 స్కోర్ ఆధారంగా వీరిని నియమించనుంది. 

 

ఎంపికైనవారికి మొదటి ఏడాది శిక్షణ టైమ్‌లో రూ.10.52 లక్షలు వేతనం ఉంటుంది. జూనియర్ మేనేజర్ పోస్టుకు ఎంపికైన తర్వాత రూ.15.73 లక్షలు పొంద‌వ‌చ్చు. ఇక మొత్తం ఖాళీలు 120 ఉండగా అందులో మెకానికల్ లేదా ప్రొడక్షన్ ఇంజనీరింగ్- 45, ఎలక్ట్రికల్ లేదా పవర్ ఇంజనీరింగ్- 29, ఇన్‌స్ట్రుమెంటేషన్, ఎలక్ట్రానిక్స్, టెలీకమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్- 15, కెమికల్ ఇంజనీరింగ్- 9, మెటల్లార్జికల్ ఇంజనీరింగ్- 13, సివిల్- 5, ఆర్కిటెక్చర్ లేదా సిరామిక్స్ ఇంజనీరింగ్- 5, మైనింగ్ ఇంజనీరింగ్ లేదా డిప్లొమా- 4 పోస్టులున్నాయి.


 
ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఇప్ప‌టికే ప్రారంభ‌మైంది.  2020 మే 2వ తేదీ ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది. అంటే మ‌రో రెండు రోజులు మాత్ర‌మే గ‌డువు మిగిలి ఉంది. కాబ‌ట్టి, ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థులు ఇలాంటి మంచి ఛాన్స్‌ను మిస్ చేసుకోకండి. ఇక ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన మ‌రిన్న‌ వివరాల కోసం https://nalcoindia.com/ వెబ్‌సైట్ ఓపెన్ చేసి చూసుకోవ‌చ్చు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: