ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ‌దేశాల‌ను వ‌ణికిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ మ‌హ‌మ్మారి ధాటికి ప్ర‌జ‌లు తీవ్రంగా ఇబ్బందులు ప‌డుతున్నారు. చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైర‌స్‌కు వ్యాక్సిన్ లేకపోవడంతో ప్ర‌భుత్వాల‌కు పెద్ద స‌వాల్‌గా మారింది. ఇక ఈ మ‌హ‌మ్మాని మ‌ట్టుపెట్టాలంటే కేవ‌లం భౌతిక దూరం, వ్య‌క్త‌గ‌త శుభ్ర‌త పాటించ‌డం వ‌ల్లే సాధ్యం అవుతుంద‌ని భావించిన ప్ర‌భుత్వాలు ఇప్ప‌టికే ప్ర‌జ‌ల‌ను బ‌య‌ట‌కు రాకుండా లాక్‌డౌన్ విధించాయి. ప్ర‌స్తుతం భార‌త్‌లోనూ మూడో ద‌శ లాక్‌డైన్ కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. ఈ లాక్‌డౌన్‌ నేపథ్యంలో దేశంమొత్తం ఇళ్లకే పరిమితమైంది.

 

ఈ క్రమంలోనే కొందరికి తినేందుకు తిండిలేక చాలా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. మ‌రికొంద‌రు ఉద్యోగాలు కూడా పోగొట్టుకుంటున్నారు. అయితే ఇలాంటి స‌మ‌యంలో ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఖాళీల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తోంది. జనరల్ మెడిసిన్, పల్మనరీ మెడిసిన్, అనస్థీషియాలజీలో ఈ ఖాళీలున్నాయి. నోటిఫికేష‌న్ ప్ర‌కారం ఇందులో మొత్తం 1,070 స్పెషలిస్ట్ పోస్టులు ఉన్నాయి. సంబంధిత మెడికల్ విభాగంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. 

 

ఇక మొత్తం 1,070 పోస్టులు ఉండ‌గా.. అందులో జనరల్ మెడిసిన్- 360, పల్మనరీ మెడిసిన్- 363 మ‌రియు అనస్థీషియాలజీ- 347 ఖాళీలు ఉన్నాయి. ఇక ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ఇప్ప‌టికే ప్రారంభ‌మైంది. 2020 ఏప్రిల్ 29 దరఖాస్తు ప్రారంభం అయ్యింది. 2020 మే 7 ఈ పోస్టుల ద‌ర‌ఖాస్తు లాస్ట్ డేట్‌. అంటే మ‌రో రెండు రోజులు మాత్ర‌మే మిగిలి ఉన్నాయి. కాబ‌ట్టి ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థ‌లు వెంట‌నే ద‌ర‌ఖాస్తు ప్రారంభించండి. ఇక అభ్య‌ర్థ‌లు వ‌య‌స్సు విషయానికి వ‌స్తే 40 ఏళ్లు ఉండాలి. మ‌రియు వేతనం రూ.1,10,000 ల‌భిస్తుంది. ఈ నోటిఫికేష‌న్ మ‌రిన్ని వివ‌రాల కోసం  http://dme.ap.nic.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవ‌చ్చు. నోటిఫికేష‌న్ పూర్తి వివ‌రాల‌ను తెలుసుకుని.. అర్హులు వెంట‌నే ద‌ర‌ఖాస్తు చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: