ప్రస్తుతం కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో అన్ని దేవాలయాలు మూతపడిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అలాగే నిత్యం భక్తులతో కళకళలాడే తిరుమల తిరుపతి దేవస్థానం కూడా తన కలను కోల్పోయింది. ఇక భక్తులు ఎవరూ లేకుండా పూజారులతో నిత్యం పూజలు అందుకుంటున్నాడు ఆ దేవదేవుడు. ఇలా 40 రోజులపాటు ఎన్నడూ భక్తులు లేకుండా చూసిన తరుణం లేదు అనే చెప్పాలి. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త తెలియజేసింది. అది ఏమిటి అన్న విషయానికి వస్తే టీటీడీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఎస్వీబీసీ ఛానల్ కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సీఈఓ పోస్టుకు భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానం పలుకుతుంది.


ఇందులో భాగంగానే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ లో మూడేళ్ళ కాల పరిమితికి సీఈఓ ఆఫీసర్ పోస్టుల భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తుంది. ఇక ఈ పోస్టు కేవలం హిందువులు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు అని తెలియచేసింది. ఇక ఈ సంబంధిత పోస్టుకు దరఖాస్తు చేసుకోవడానికి మే 29న చివరి తేదీ అని టీటీడీ నిర్ణయం తీసుకోవడం జరిగింది.


ఇక అభ్యర్థుల వయోపరిమితి విషయానికి వస్తే ఏప్రిల్ 1, 2020 నాటికి 40 నుంచి 55 వయసు లోపు వారు కచ్చితంగా ఉండాలి. విద్య అర్హత అనుభవం లాంటి వివరాలు తెలుసుకోవాలంటే http://www.svbcttd.com ను సంప్రదించండి. అలాగే ఈ వెబ్ సైట్ లోనే దరఖాస్తు ఫామ్ కూడా లభిస్తుంది. ఇక దరఖాస్తు ఫామ్ లో వివరాలు ఫీల్ చేసిన తర్వాత mdsvbc@gmail.com మెయిల్ లేదా "మేనేజింగ్ డైరెక్ట‌ర్‌, శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్‌, అలిపిరి, తిరుప‌తి - 517507"  చిరునామాకు పోస్ట్ ద్వారా పంపించవలసిన ఉంటుంది. ఏది ఏమైనా కానీ ఈ పరిస్థితులలో ఇలాంటి నిర్ణయం ఒకందుకు మంచిదేనని చెప్పాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి: