ప్ర‌స్తుతం కరోనా వైర‌స్‌.. ప్ర‌పంచ‌దేశాల ప్ర‌జ‌ల‌కు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. క‌రోనా దెబ్బ‌కు అగ్రరాజ్యాలు సైతం అత‌లాకుత‌లం అవుతున్నాయి. ప్ర‌స్తుతం దీనికి మందు లేకపోవడంతో అంద‌రూ నివారణ పైనే అన్ని దేశాలు దృష్టి పెట్టారు వైరస్ సోకకుండా ఉండేందుకు.. సోకిన తర్వాత ఇతరులకు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వాలు కీలక సలహాలు,సూచనలు చేస్తున్నాయి. అలాగే ప్ర‌జ‌ల‌ను బ‌య‌ట‌కు రాకుండా లాక్‌డౌన్ విధించారు. దీంతో ప్ర‌జ‌లు అనేక ఇబ్బందులు ప‌డుతున్న‌రు.

 

కొంద‌రు ఉద్యోగాలు కూడా పోగొట్టుకుంటున్నారు. అయితే ఇలాంటి స‌మ‌యంలో నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్ చెబుతూ తెలంగాణలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్-AIIMS లో ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదలైంది.  ఈ నోటిఫికేష‌న్‌లో మొత్తం 141 ఖాళీలు ఉన్నాయి.యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లో గల ఎయిమ్స్‌లో ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది జిప్‌మర్. ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ లాంటి పోస్టులున్నాయి. ఈ ఈ నోటిఫికేష‌న్‌లో మొత్తం 141 పోస్టులు ఉండ‌గా.. అందులో ప్రొఫెసర్- 20, అడిషనల్ ప్రొఫెసర్- 22, అసోసియేట్ ప్రొఫెసర్- 34 మ‌రియు అసిస్టెంట్ ప్రొఫెసర్- 65 ఖాళీలు ఉన్నాయి. 

 

వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. ఇక ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి జూన్ 24 చివరి తేదీ. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసిన తర్వాత అవసరమైన డాక్యుమెంట్స్ జత చేసి అప్లికేషన్ ఫామ్‌ను నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు పంపాల్సి ఉంటుంది. అంతేకాకుండా, ఇమెయిల్ కాపీ కూడా పంపాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.jipmer.edu.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవ‌చ్చు. ఆస‌క్తిగ‌ల అభ్య‌ర్థ‌లు నోటిఫికేష‌న్‌లో పూర్తి వివ‌రాలు తెలుసుకుని వెంట‌నే ద‌ర‌ఖాస్తు చేసుకోండి. ఈ పోస్టుల‌కు 2020 మే 1 నుంచి దరఖాస్తులు ప్రారంభం అయ్యాయి. మీరు కూడా ఈ పోస్టుల‌కు అర్హులైతే లేట్ చేయ‌కుండా ద‌ర‌ఖాస్తు చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: